సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) కి ఉన్నటువంటి క్రేజ్ మరియు మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.సీనియర్ ఎన్టీఆర్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా, తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకోవడం కోసం మొదటి సినిమా నుండే ప్రయత్నిస్తున్నాడు.
ఆ ప్రయత్నం లోనే బాలయ్య బాబు కి మాస్ ఇమేజి ఉన్నాడు.కేవలం మాస్ సినిమాలు మాత్రమే కాకుండా ‘ఆదిత్య 369 ‘ మరియు ‘భైరవ ద్వీపం’ వంటి ప్రయోగాత్మక చిత్రాలను కూడా అందించిన ఘనత బాలయ్య బాబు సొంతం.
ఎన్ని జెనెరేషన్స్ మారినా ఈ సినిమాలను నచ్చని ప్రేక్షకుడు అంటూ లేరు.అలాంటి సంచలనాత్మక చిత్రాలు బాలయ్య కెరీర్ లో చాలానే ఉన్నాయి.
ఉదాహరణకి ఫ్యాక్షన్ జానర్ చిత్రాలను టాలీవుడ్ కి పరిచయం చేసిన హీరో బాలయ్య బాబు నే.ఆయన పరిచయం చేసిన తర్వాత ఈ జానర్ లో ఎన్ని సినిమాలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
అలా ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందించిన బాలయ్య బాబు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో సమానంగా రెమ్యూనరేషన్ ని తీసుకునేవాడు.బాక్స్ ఆఫీస్ బొనాంజా గా పేరు తెచ్చుకున్న బాలయ్య బాబు తో సినిమాలు చెయ్యడానికి క్యూలు కట్టేవారు అప్పట్లో.ఆరోజుల్లో బాలయ్య బాబు ఎంత బిజీ అంటే, ఒకే రోజు రెండు సినిమాలను విడుదల చేసేంత బిజీ గా ఆయన క్యాలండర్ ఉండేది.అప్పట్లో బాలయ్య బాబు ఫ్లాప్ సినిమాలకు పూర్తి స్థాయి రెమ్యూనరేషన్స్ తీసుకునేవాడు కాదట.
అలాగే నా అనుకున్న మనుషుల దగ్గర అసలు ఆయన పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయట.ఉదాహరణకి మంచు మనోజ్ హీరో గా నటించిన ‘ఊ కొడతావా.
ఉలిక్కి పడుతావా’( Uu Kodathara Ulikki Padathara ) అనే చిత్రం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.ఈ చిత్రం లో బాలయ్య బాబు ఒక ప్రధాన పాత్రలో నటించాడు.
ఈ పాత్ర కోసం బాలయ్య బాబు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని అప్పట్లో ఒక టాక్ ఉండేది.కానీ మంచు లక్ష్మి( Lakshmi Manchu ) ఒక ఇంటర్వ్యూ లో చెప్తూ నాన్న మోహన్ బాబు గారి మీద గౌరవం తో బాలయ్య అంకుల్ ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు.మేము ఇస్తున్నా కూడా ఆయన నో చెప్పారు, మా కుటుంబం తో బాలయ్య బాబు కి ఉన్న సంబంధం అలాంటిది అంటూ ఆమె చెప్పిన మాటలు అప్పట్లో వైరల్ గా మారాయి.అలా బాలయ్య బాబు ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా చేసిన ఏకైక సినిమా ఇది మాత్రమే.