షర్మిలను పట్టించుకునే వారే లేరా ? కాంగ్రెస్ దూరం పెట్టింది అందుకేనా ? 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( Ys sharmila ) పరిస్థితి గందరగోళంగా మారింది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పోటీకి దించుతున్నట్లుగా షర్మిల ప్రకటించారు.

 Is There Anyone Who Cares About Ys Sharmila, Is That Why The Congress Has Dista-TeluguStop.com

అయితే పోటీ చేసేందుకు పెద్దగా అభ్యర్థులు ఆసక్తి చూపించకపోవడం వంటి కారణాలతో తానే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు .అయితే చివరకు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పూర్తిగా తెలంగాణ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని , కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు షర్మిల ప్రకటించి సంచలనం సృష్టించారు.

Telugu Aicc, Brs, Dk Shiva Kumar, Revanth Reddy, Telangana, Ys Sharmila, Ysrtp-P

 తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ( BRS party )ని ఓడించడమే తన లక్ష్యమని,  అందుకే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని, తమ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దించినా,  ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అంతిమంగా బీఆర్ఎస్ కు మేలు జరుగుతుందని , అది ఇష్టం లేకనే పోటీకి దూరమైనట్లు షర్మిల ప్రకటించారు.దీంతో కాంగ్రెస్ కు మద్దతు పలకడంతో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని అందరూ భావించారు.కానీ కాంగ్రెస్ నుంచి ఆమెకు ఎటువంటి ఆహ్వానాలు అందలేదు.  పైగా ఆమెను ఎన్నికల ప్రచారానికి దింపితే కలిగే లాభం కన్నా , నష్టమే ఎక్కువ ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు .

Telugu Aicc, Brs, Dk Shiva Kumar, Revanth Reddy, Telangana, Ys Sharmila, Ysrtp-P

 తాను తెలంగాణ వ్యక్తిని షర్మిల ఎంతగా చెప్పుకున్నా,  ఆమె పై ఆంధ్ర ముద్ర ఉందని , అది తమకు చేటు తెస్తుందని కాంగ్రెస్( Congress party ) భయపడుతోంది.కాంగ్రెస్ నుంచి పిలుపు వస్తే ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు షర్మిల సిద్ధంగానే ఉన్నా,  ఆమెను పిలిచేందుకు మాత్రం ఆ పార్టీ సాహసించలేదు పోతుంది.అసలు షర్మిలకు తెలంగాణలో బలమైన కేడర్ లేదని , ఏ నియోజకవర్గంలోనూ ఆమెకు ప్రత్యేకంగా ఓటు బ్యాంకు లేదని,  అటువంటి ఆమెను కాంగ్రెస్ కు మద్దతుగా పిలిచినా ఒరిగేదేమీ లేదని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు .దీంతో షర్మిల రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube