1.ఢిల్లీలో కృత్రిమ వాన
ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఆమోదిస్తే ఈ నెల 20న ఢిల్లీలో కృత్రిమ వాహనం కురిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
2.వ్యూహం ట్రైలర్ పై ఫిర్యాదు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చూసిన వ్యూహం సినిమా ట్రైలర్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను కించపరిచేలా ఉందని టిడిపి రీసెర్చ్ కమ్యూనికేషన్స్ కమిటీ సభ్యుడు గంగాధర్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు
3.నకిలీ లేఖతో చంద్రబాబుపై దుష్ప్రచారం
రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని, ఒక సామాజిక వర్గ ప్రజలకు విజ్ఞప్తి అంటూ చంద్రబాబు పేరు లేకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని వైసీపీ పై టిడిపి విమర్శలు చేసింది.
3.పులివెందుల అభివృద్ధి పనులపై జగన్ సమీక్ష
ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పర్యటంలో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి పనులపై అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.
4.కెసిఆర్ పై బండి సంజయ్ విమర్శలు
అంబలి , అన్నదానం చేస్తే చేసిన పాపాలు పోతాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
5.తమిళనాడు, పంజాబ్ గవర్నర్ లకు సుప్రీంకోర్టు వార్నింగ్
తమిళనాడు గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో పంజాబ్ , తమిళనాడు గవర్నర్ ల పై మండిపడింది.
6.పురందేశ్వరి చంద్రముఖిగా మారారు: మంత్రి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చంద్రముఖిగా మారారని ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు విమర్శించారు.
7.పొంగులేటి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు
ఖమ్మం మాజీ ఎంపీ , పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో నేటితో ఐటి సోదాలు ముగిశాయి.
8.తెలంగాణ దీపావళి సెలవు తేదీ మార్పు
తెలంగాణ దీపావళి పండుగ సెలవు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.వాస్తవంగా నవంబర్ 12 ను సెలవు దినంగా ప్రకటించగా , దానిని ఇప్పుడు 13 వ తేదీకి మార్చింది.
9.జెసి ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
నాపై పెట్టిన కేసులు అన్నీ పూర్తి కావాలి అంటే మూడు జన్మలు కావాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
10.నేటితో ముగియనున్న వైసీపీ బస్సు యాత్ర
వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నేటితో ముగియనుంది.
11.తిరుమల సమాచారం
ఈ నెల 12 న శ్రీవారి ఆలయంలో దీపావళి సందర్భంగా ప్రోటోకాల్ దర్శనం మినహా బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు.అంటే 11 వ తేదీన బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖ లు స్వీకరించబడవు అని టీటీడీ పేర్కొంది.
12.విజయవాడ డివిజన్ లో భారీగా రైళ్లు రద్దు
అవసరమైన భద్రత పనుల కారణంగా విజయవాడ డివిజన్ లో పలు రైలు సర్వీసులను రద్దు చేశారు.
13.బీఎస్పీ ఐదో జాబితా విడుదల
బహుజన్ సమజ్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఐదో జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు
14.కాంగ్రెస్ పై హరీష్ రావు విమర్శలు
పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదేండ్లు వెనక్కి పోతామని మంత్రి హరీష్ రావు విమర్శించారు.
15.హైదరాబాద్ కు ప్రధాని మోది రాక
భారత ప్రధాని నరేంద్ర మోది రేపు హైదరాబాద్ కు రానున్నారు.పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే మాదిగ విశ్వరూప బహిరగసభలో ఆయన పాల్గొననున్నారు.
16.ఈసీ పై కేఏ పాల్ ఆగ్రహం
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్ళీ తనకు పార్టీ గుర్తు ఎప్పుడు కేటాయిస్తారని ప్రశ్నించారు .సెప్టెంబర్ లోనే అన్ని పత్రాలు ఇచ్చామని , ఇప్పటివరకు పార్టీ కీ ఎన్నికల గుర్తులు కేటాయించలేదని మండిపడ్డారు.
17.దర్శకుడు రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు
టాలీవుడ్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది .ప్రభుత్వం కేటాయించిన బంజారాహిల్స్ లోని రెండు ఎకరాల భూమిని రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై నే కోర్టు నోటీసులు జారీ చేసింది.
18.విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఆవిష్కరణ
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని సినీ హీరో కమల్ హాసన్ ప్రారంభించారు.
19.తీన్మార్ మల్లన్నకు పార్టీ కీలక బాధ్యతలు
ఇటీవల కాంగ్రెస్లో చేరిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ బాధ్యతలను అప్పగించారు.
20.తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్కు నేడు చివరి తేదీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది.నేటితో నామినేషన్ పత్రాల దాఖలుకు గడువు ముగిముంది.