ఖలిస్తాన్ ఉగ్రవాది , ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ( Canadian Prime Minister Justin Trudeau )వ్యాఖ్యల తర్వాత ఖలిస్తాన్ గ్రూపులు , మద్ధతుదారులు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ‘‘సిక్స్ ఫర్ జస్టిస్ ’’ (ఎస్ఎఫ్‌జే) తీవ్రంగా రియాక్ట్ అవుతోంది.
ఈ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ వరుసగా భారత్‌కు హెచ్చరికలు చేస్తున్నాడు.భారత్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ను వరల్డ్ టెర్రర్ కప్‌గా చేస్తానంటూ పన్నూ వీడియోలు విడుదల చేస్తున్నాడు.

ఈ నెల 19న ఎయిరిండియా విమానాన్ని పేల్చివేస్తామని పన్నూ హెచ్చరించాడు.ఆ రోజున సిక్కులెవరూ ఎయిరిండియా విమానాల్లో పర్యటించవద్దని సూచించాడు.అంతేకాదు.ఆ రోజున ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేస్తామని.దాని పేరును మారుస్తామని పన్నూ హెచ్చరించాడు.అప్పట్లో ఈ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
దీనిపై కెనడా ప్రభుత్వం స్పందించింది.ఈ మేరకు కెనడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఆ దేశ రవాణా శాఖ మంత్రి పాబ్లో రోడ్రిగ్జ్( Pablo Rodriguez ) తెలిపారు.
‘‘ఎయిరిండియా విమానానికి ఏ ముప్పు కలిగినా మా ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది.మా భాగస్వాములకు ఆన్‌లైన్‌లో చెలామణి అవుతున్న ఇటీవలి బెదిరింపులను పరిశీలిస్తున్నాము.
కెనడియన్లను సురక్షితంగా ఉంచడానికి అవసరమైన ప్రతిదాన్ని మేము చేస్తాము’’ అంటూ రోడ్రిగ్జ్ ట్వీట్ చేశారు.

అంతకుముందు .కొద్దిరోజుల క్రితం హిందువులంతా తక్షణం కెనడాను వదిలిపెట్టాల్సిందిగా పన్నూ సారథ్యంలోని ఎస్ఎఫ్‌జే హెచ్చరించింది.నిజ్జర్ హత్యకు గాను భారతదేశానికి మద్ధతుగా హింసను ప్రోత్సహించినందుకు కెనడాను విడిచిపెట్టాల్సిందిగా అల్టీమేటం జారీ చేసింది.
ఇక్కడున్న హిందువులు భారతదేశానికి మద్ధతు ఇవ్వడమే కాకుండా.ఖలిస్తాన్ మద్ధతుదారుల ప్రసంగాలు, వ్యక్తీకరణను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్ఎఫ్‌జే ఆరోపించింది.
ఎస్ఎఫ్‌జే వీడియోనే కాకుండా.కెనడాలోని భారత్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్తలకు బెదిరింపులు.
వారి పోస్టర్‌లు, గ్రాఫిటీలతో దేవాలయాలను అపవిత్రం చేసిన ఘటనలు ఈ వేసవి నుంచి భారీగా పెరిగాయి.ఈ చర్యలు కెనడాలో హిందూ ఫోబియా సమస్య తెరపైకి రావడదానికి దారి తీశాయి.
ఈ ఘటనలను కెనడాలో విపక్ష నేత పియరీ పొయిలీవ్రే ఖండించారు.







