టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్( Devishri Prasad ) రెమ్యునరేషన్ ప్రస్తుతం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.కొన్నేళ్ల క్రితం వరకు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నా అనిరుధ్, థమన్( Anirudh, Thaman ) స్థాయిలో ఆయన చేతిలో ఆఫర్లు అయితే లేవు.
సుకుమార్, హరీశ్ శంకర్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ కు వరుసగా ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం.
తెలుగులో దేవిశ్రీ ప్రసాద్ వరుస ఆఫర్లతో బిజీ కావడానికి అసలు కారణం మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు తమ మ్యూజిక్, బీజీఎంతో మెప్పించడంలో ఫెయిల్ కావడమే అని తెలుస్తోంది.దేవిశ్రీకి ఆఫర్లు మళ్లీ పెరగడం అంటే రాబోయె రోజుల్లో దేవిశ్రీ ప్రసాద్ కు పూర్వ వైభవం రావడం గ్యారంటీ అని నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.పుష్ప2, ఉస్తాద్ భగత్ సింగ్( Pushpa2, Ustad Bhagat Singh ) సినిమాలు ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ ఖాతాలో ఉన్నాయి.
శేఖర్ కమ్ముల ( Shekhar Kammula )భవిష్యత్తు ప్రాజెక్ట్ కు కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అని సమాచారం.నాగచైతన్య చందు మొండేటి కాంబో మూవీకి సైతం దేవిశ్రీ ప్రసాద్ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.ఈ ప్రాజెక్ట్ లతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లకు కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.
దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇస్తే మాత్రం ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు తిరుగుండదని చెప్పవచ్చు.దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి దేవిశ్రీ ప్రసాద్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.దేవి సినిమా నుంచి ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
ఇతర భాషల్లో సైతం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు మంచి గుర్తింపు ఉంది.