Samantha : విడాకులు తీసుకున్నా సామ్ ఒంటిపై చై ఆనవాళ్లు.. ఆ పచ్చబొట్టు చెరిగిపోదంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య( Naga Chaitanya ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ ( Tollywood )లో ఒకప్పుడు వీరు కూడా బ్యూటిఫుల్ కపుల్ అన్న విషయం తెలిసిందే.

 Chay Tattoo Appears Samantha Body See Pic-TeluguStop.com

ప్రేమించి పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఊహించని విధంగా 2021లో విడాకులు తీసుకొని విడిపోయారు.ఇక విడాకులు తర్వాత ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కువగా నిలుస్తూ వస్తున్నారు.

అంతేకాకుండా విడివిడాకుల విషయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ సమయంలో సంచలనంగా మారింది.ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా వీరిద్దరి వ్యవహారం గురించి చర్చించుకుంటూ ఉన్నారు.

విడాకుల తర్వాత విడాకులకు గల అసలు కారణాలు ఏంటి అన్న విషయాలు అభిమానులు,నెటిజన్స్ చాలా సమయాలలో చాలా సందర్భాలలో ప్రశ్నించినప్పటికీ ఆ విషయాలను దాటవేస్తూ వచ్చారు సమంత( Samantha ) చైతన్య.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించి మరో ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే స‌మంత‌, చైతూతో ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు త‌న శ‌రీరంపై కొన్నిప‌చ్చ‌బొట్లు వేయించుకుంది.ముఖ్యంగా త‌న న‌డుము పైభాగంలో చై అని టాటూ వేయించుకుంది.ఇటీవ‌ల షేర్ చేసిన కొన్ని ఫోటోల్లో ప‌చ్చ‌బొట్టు క‌నిపించ‌క‌పోవ‌డంతో టాటూ తీసేయించుకుంద‌ని అందరు అనుకున్నారు.

టాటూ( Tattoo ) తీయించేసుకుని త‌న మ‌న‌సులోనూ చై జ్ఞాప‌కాల‌ను పూర్తిగా చెరిపేసింద‌ని భావించారు.ఆ సమయంలో సమంత పై కొంతమంది ట్రోలింగ్స్ కూడా చేశారు.కానీ తాజాగా సమంత ఒక ట్విస్ట్ ఇచ్చింది.

త‌న ఒంటిపై చై అనే టాటూ ఇంకా ఉన్న‌ట్లు చెప్ప‌క‌నే చెప్పింది.తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలో న‌డుము పై భాగంలో చై అని రాసి ఉన్న టాటూ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

అంటే గ‌తంలో కేవ‌లం ఆ ప‌చ్చ‌బొట్టు క‌నిపించ‌కుండా మేక‌ప్‌తో క‌వ‌ర్ చేసిందే త‌ప్ప శాశ్వ‌తంగా తొల‌గించుకోలేద‌న్న‌మాట‌! ఇది చూసిన జ‌నాలు ఈ దాగుడుమూత‌లేంటి సామ్‌? ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు ఓపెన్ అవ్వచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube