జనగామలో బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో జనగామ పరిస్థితి దారుణంగా ఉండేదని కేసీఆర్ అన్నారు.ఉద్యమ సమయంలో తాను ఏడ్చిన ప్రదేశాల్లో బచ్చన్నపేట ఒకటన్న ఆయన నెల రోజుల పాటు స్నానాలు చేయని పరిస్థితులను చూశానన్నారు.
ఆనాడు ఎండిపోయిన బచ్చన్న పేట చెరువు 360 రోజులు నిండే ఉంటుందని పేర్కొన్నారు.ఇవాళ అత్యధికంగా వడ్లు పండించే జిల్లా జనగామ అని తెలిపారు.
జనగామ జిల్లా బాగా అభివృద్ధి చెందుతోందని సీఎం కేసీఆర్ అన్నారు.భవిష్యత్ లో ఇండస్ట్రీస్ తో అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
ఎక్కడ కరువు వచ్చినా జనగామలో రాదని తెలిపారు.ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయన్న కేసీఆర్ ప్రజలు ఆగమాగం కావొద్దని సూచించారు.
అదేవిధంగా ఎవరో చెప్పారని ఓటు వేయొద్దని వెల్లడించారు.