యూపీఎస్సీ( UPSC ) నిర్వహించే సివిల్స్ సాధించడం కోసం దేశంలో ఎంతోమంది రేయింబవళ్లు కష్టపడుతున్నారు.సివిల్స్ పరీక్షల్లో ఒకసారి సక్సెస్ సాధిస్తేనే గొప్ప కాగా ఒక యువతి మాత్రం ఒకసారి ఐపీఎస్ మరోసారి ఐఏఎస్ సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.
ఉత్తరాఖాండ్( Uttarakhand ) లోని కర్ణ ప్రయాగ్ కు చెందిన ముద్ర గైరోలా ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఢిల్లీలో నివశిస్తుండటం గమనార్హం.పది, ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన ముద్ర ఆ తర్వాత బీడీఎస్ లో బంగారు పతకాన్ని సాధించారు.
ఎండీఎస్ చదువును మధ్యలోనే వదిలేసి యూపీఎస్సీ దిశగా అడుగులు వేశారు.వరుసగా మూడుసార్లు పరీక్షల్లో ఫెయిల్ అయిన ముద్ర గైరోలా 2021లో ఐపీఎస్ అయ్యారు.
అయితే ఐఏఎస్ కావడం లక్ష్యం కావడంతో 2022లో మరోసారి ప్రయత్నించి లక్ష్యాన్ని సాధించారు.తన కూతురు ఐఏఎస్ కావాలనుకున్న తండ్రి తన కల నెరవేరవడంతో ఎంతో సంతోషిస్తున్నారు.
సరైన ప్రణాళికతో ప్రిపేర్ అయితే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సులువేనని ముద్ర గైరోలా( Mudra gairola ) చెబుతున్నారు.ఓటమికి ఎప్పుడూ భయపడవద్దని ఏకాగ్రతను మిస్ కావద్దని ఆమె సూచిస్తున్నారు.ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదువుకుంటే లక్ష్యాన్ని సాధించడం సులువేనని ముద్ర గైరోలా చెబుతున్నారు.లక్ష్యాన్ని సాధించాలనే కసితో కష్టపడటం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని ఆమె అన్నారు.
ముద్ర గైరోలా సక్సెస్ విషయంలో ఆమె కుటుంబ సభ్యులు ఎంతో సంతోషిస్తున్నారు.ఇప్పటికే ఎంతో ఎత్తుకు ఎదిగిన ముద్ర గైరోలా సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడితే సక్సెస్ సొంతమని ఆమె ప్రూవ్ చేస్తున్నారు.ముద్ర గైరోలా మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.కోచింగ్ కు లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి బదులుగా సరైన ప్రణాళికతో ముందుకు వెళితే కెరీర్ పరంగా విజయాలు సొంతమవుతాయని ఆమె చెబుతున్నారు.