ఈ నియమాలు పాటిస్తే ఇల్లు స్వర్గసీమ కావడం ఖాయం..!

సాధారణంగా ఇంటి నుంచి బయటకు వెళితే ఎన్నో రకాల ఒత్తిడి, సవాళ్లు అన్నీ ఎదురుతూ ఉంటాయి.అన్నిటినీ ముగించుకొని ఇంటికి వచ్చామంటే కాస్త హాయిగా అనిపిస్తూ ఉంటుంది.

 Important Tips To Follow To Make Home Happier And Calmer Details, Important Tips-TeluguStop.com

అయితే ముందు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే మనకు కూడా మానసిక ప్రశాంతత( Mental Peace ) ఉంటుంది.అదే ఇల్లంతా చెల్ల చెదురు అయినా సామాన్లతో పరిశుభ్రత లేకుండా దుర్వాసన వస్తూ ఉంటే దీని వల్ల మనకు చికాకు మరింత పెరిగిపోతుంది.

అందుకోసం ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే హలులో సోఫా సెట్లు, టీవీలు, టీ పాయ్ లు కుర్చీలు అన్ని ఉండాలనే నిబంధన ఏమీ లేదు.

మీ అవసరాన్ని బట్టి మాత్రమే సామాన్లను ఉంచుకోవాలి.అదనంగా ఒక్కటి కూడా ఉండకూడదు.వీటినే విజువల్ నాయిస్ అని కూడా అంటారు.చూడడం వల్ల విసుగును కలిగిస్తాయని తిని అర్థం.

అలాగే అవసరం లేదు అనుకున్న వాటిని తీసేయడమే మంచిది.ఇంట్లో ఒక దగ్గర పెద్ద డొనేషన్ బాక్స్ ని( Donation Box ) పెట్టుకోవాలి.

ఏది ఎక్కడ అవసరం లేని వస్తువు కనిపించినా తీసుకెళ్లి అందులో వేయడం మంచిది.వీలు కుదిరినప్పుడల్లా వాటిని అవసరమైన వారికి ఇచ్చేయాలి.

Telugu Space, Box, Happier, Cleanliness, Important Tips, Peaceful Tips-Latest Ne

ఇంట్లో( Home ) ఒక మూలాన మీకు నచ్చిన పుస్తకాలతో పచ్చని మొక్కలతో చక్కని కార్నర్‌ స్పేస్ ని( Corner Space ) ఏర్పాటు చేసుకోవాలి.అక్కడ కూర్చుని ఏవో ఒకటి చదువుకోవడం వల్ల మానసిక ప్రశాంతత అనిపిస్తుంది.అంతేకాకుండా ఇంటిని తక్కువ సామాన్లతో ఎక్కువ విశాలంగా ఉంచుకోవాలి.గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి.పగటిపూట సహజమైన కాంతి ఇల్లంతా వచ్చేలా జాగ్రత్తగా తీసుకోవాలి.

Telugu Space, Box, Happier, Cleanliness, Important Tips, Peaceful Tips-Latest Ne

అలాగే బూజులు, చెత్త లాంటివి ఇల్లంతా ఉంటే ఆ ఇంట్లో ప్రశాంత వాతావరణము అసలు ఉండదు.తిన్న గిన్నెలు, పండ్ల తొక్కలాంటి వాటిని ఎక్కడివి అక్కడ వదిలేయకూడదు.వీటన్నిటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

దీని వల్ల ఇల్లు శుభ్రంగా ఉంటుంది.ఈగలు, దోమలు( Mosquitoes ) లాంటివి ఎక్కువగా ఇంట్లోకి రావు.

చదివేసిన పేపర్లు, పుస్తకాలను ఎప్పుడు ఎప్పటికప్పుడు తీసివేయాలి.షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఏది నచ్చితే అది ఊరికే కొనేయకూడదు.

వస్తువు అవసరం తగినంత ఉందనుకుంటే మాత్రమే తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube