మోకాళ్ళ నొప్పుల‌తో అడుగు తీసి అడుగు వేయ‌లేక‌పోతున్నారా.. అయితే ఈ బోన్ బూస్ట‌ర్ స్మూతీ మీకోస‌మే!

ఇటీవల రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మోకాళ్ళ నొప్పులతో( knee pains ) బాధపడుతున్నారు.మోకాళ్ళ నొప్పుల వల్ల ఎక్కువ సేపు నడవడానికి, నిలబడడానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.

 Bone Booster Smoothie For Get Rid Of Knee Pain! Bone Booster Smoothie, Knee Pain-TeluguStop.com

ఇక మెట్లు ఎక్కడం అంటే గగనమే.ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు మందులు వాడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీ డైట్ లో ఇప్పుడు చెప్పబోయే స్మూతీ ఉండాల్సింది.ఈ స్మూతీని తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఎంత తీవ్రంగా ఉన్నా సరే దెబ్బకు మాయం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Apricots, Apricotsoats, Bonebooster, Tips, Healthy, Knee Pain, Latest-Tel

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు ఆప్రికాట్స్( Apricots ) వేసుకొని వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆప్రికాట్స్ లో కాల్షియం, కాపర్, రాగి, మాంగనీస్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.ఇవి ఎముకల్లో సాంద్రతను పెంచడానికి అద్భుతంగా తోడ్పడతాయి.

మోకాళ్ళ నొప్పులకు చెక్ పెడతాయి.అలాగే మరొక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఓట్స్( Oats ) వేసి వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్‌ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఓట్స్ మరియు ఆప్రికాట్స్ వేసుకోవాలి.అలాగే ఐదు జీడిపప్పులు, ఐదు పిస్తా పప్పులలో పాటు ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు( Almond milk ), పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా ఆప్రికాట్స్ ఓట్స్ స్మూతీ సిద్ధం అవుతుంది.

Telugu Apricots, Apricotsoats, Bonebooster, Tips, Healthy, Knee Pain, Latest-Tel

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని తీసుకుంటే ఆరోగ్యపరంగా చాలా మేలు జరుగుతుంది.ముఖ్యంగా బలహీనమైన ఎముకలు దృఢంగా, గట్టిగా మారతాయి.మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి.

మళ్లీ మీరు మునుపటిలా పరుగులు తీస్తారు.కాబట్టి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ బోన్ బూస్టర్ స్మూతీని డైట్ లో చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube