ఏథర్ ( Ather ) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్‌లలో ఒకటి.ఇటీవలి సంవత్సరాలలో దాని మార్కెట్ వాటా క్రమంగా పెరుగుతోంది.
ఫైనాన్షియల్ ఇయర్ 2023లో, ఏథర్ 13% మార్కెట్ వాటాతో భారతదేశంలో మూడవ అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్( Electric Scooter ) తయారీదారుగా అవతరించింది.కంపెనీ హై క్వాలిటీ స్కూటర్లు, వినూత్న ఫీచర్లు, శక్తివంతమైన మోటార్, బ్యాటరీలు, లాంగ్ రేంజ్, స్టైలిష్ డిజైన్ అందిస్తున్నాయి.
అందుకే ఇండియాలో బాగా పాపులర్ అయ్యాయి.అయితే భారతీయులను ఆకట్టుకోవడానికి ఈ కంపెనీ మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ పరిచయం చేసేందుకు సిద్ధమైంది.
ఈసారి హై రేంజ్ స్కూటర్ తీసుకురావడానికి ఆ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
ఆటోమొబైల్ రిపోర్ట్స్ ప్రకారం, ఏథర్ 450S హెచ్‌ఆర్( Ather 450S HR ) అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలోనే విడుదల చేయనుంది, ఇందులో HR అనేది “హై రేంజ్”ని సూచిస్తుంది.ఇది 3.76kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులోకి రానుంది.ఇది ప్రస్తుత 450S 2.9kWh బ్యాటరీ ప్యాక్ కంటే పెద్దది.ఈ బ్యాటరీ ప్యాక్ 450S హెచ్‌ఆర్‌కు 156కి.మీల సర్టిఫైడ్ రేంజ్ ఇస్తుంది, ఇది 450X కంటే 10కిమీ ఎక్కువ.
450S హెచ్‌ఆర్ గరిష్టంగా 80kmph వేగాన్ని కలిగి ఉంటుంది, ఇది 450S, 450X కంటే 10kmph స్లోగా ఉంటుంది.ఇది నాలుగు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది: ఎకో, స్మార్ట్‌ఎకో, రైడ్, స్పోర్ట్, కానీ దీనికి వార్ప్ మోడ్ ఉండదు.దాని పెద్ద బ్యాటరీతో, 450S హెచ్‌ఆర్ రియల్ వరల్డ్ రేంజ్ దాదాపు 130 కి.మీ ఉండొచ్చు.ఇది ప్రస్తుత 450S కంటే భారీ మెరుగుదల, 450S దాదాపు 90km రియల్ వరల్డ్ రేంజ్ కలిగి ఉంది.
450S హెచ్‌ఆర్( 450S HR ) ధర ప్రస్తుత 450S కంటే ఎక్కువగా ఉండొచ్చు.ప్రస్తుతం 450S ధర రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు, FAME II సబ్సిడీలతో సహా)గా ఉంది.450S హెచ్‌ఆర్ స్కూటర్ ఈ నెల చివరిలో లేదా అక్టోబర్ 2023 ప్రారంభంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.ఏథర్ 450S హెచ్‌ఆర్ ఓలా S1 Air, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి స్కూటర్లకు పోటీ ఇస్తుంది.