యాదాద్రి భువనగిరి జిల్లా:ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లో జరగాలని,అప్పుడే అర్హులైన పేదలకు న్యాయం జరుగుతుందనిమోత్కూర్ మండలం( Mothkur ) పాలడుగు గ్రామ సర్పంచ్ మరిపల్లి యాదయ్య అన్నారు.సోమవారం గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలులో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ బహుజనులంతా రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ బంధు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ( BRS PARTY )నాయకులకు,కార్యకర్తలకుఇవ్వడమేంటని ప్రశ్నించారు.అర్హులైన దళితులకు దళిత బంధు, బీసీలకు బీసీ బంధు( BC Bandhu ), పేదలకు గృహలక్ష్మి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కానీ,స్థానిక బీఆర్ఎస్ నేతలు( BRS PARTY ) కేవలంతమ పార్టీకి చెందిన వారికే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామ సభకు సంబంధం లేకుండా బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో అర్హుల జాబితాను సిద్ధం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గూదే మధు, శేఖర్,గణేష్,పూలమ్మ, ధనలక్షి,పద్మ తదితరులు పాల్గొన్నారు.