ఆస్ట్రేలియాపై గెలిచిన తర్వాత తన కెప్టెన్సీ పై స్పందించిన కేఎల్ రాహుల్..!

వన్డే వరల్డ్ కప్ కు ముందు భారత్-ఆస్ట్రేలియా( India-Australia ) మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా శుక్రవారం జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను శుభారంభంతో ప్రారంభించింది.భారత జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ( KL Rahul ) బాధ్యతలు నిర్వర్తిస్తూ, అర్థ సెంచరీ (58) తో అదరగొట్టాడు.

 Kl Rahul Reacts To His Captaincy After Winning Against Australia , Australia, Kl-TeluguStop.com

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ( Pacer Mohammed Shami )ఏకంగా ఐదు వికెట్లు తీసి ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.

Telugu Australia, India Australia, Kl Rahul, Pacermohammed, Shubman Gill-Sports

అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత జట్టు 48.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.భారత ఓపెనర్లు ఋతురాజ్ గైక్వాడ్ 71, శుబ్ మన్ గిల్ ( Shubman Gill )74 పరుగులతో అద్భుత ఆటను ప్రదర్శించారు.కేఎల్ రాహుల్ 58, సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) 50 పరుగులతో రాణించారు.

మ్యాచ్ అనంతరం జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.తనకు కెప్టెన్సీ కొత్తేమీ కాదని, ఇప్పటికే కెప్టెన్ గా చాలా మ్యాచ్లలో జట్టును గెలిపించానని పేర్కొన్నాడు.కెప్టెన్సీ అంటే తనకు ఎంతో ఇష్టమని, కెప్టెన్ గా జట్టును ఎలా నడిపించాలో తాను అలవాటు పడ్డానని తెలిపాడు.

Telugu Australia, India Australia, Kl Rahul, Pacermohammed, Shubman Gill-Sports

కొలంబోలో ఆడిన అనుభవం ఈ మ్యాచ్లో చక్కగా ఉపయోగపడిందని తెలిపాడు.తమ జట్టు ఆటగాళ్లంతా ఎంతో ఫిట్నెస్ తో ఉన్నారని, అందుకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ఫీల్డింగ్ సమర్థవంతంగా చేశామని చెప్పుకొచ్చాడు.ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు.

గిల్ అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ కాస్త గాడి తప్పిందని, సూర్య కుమార్ యాదవ్ తో కలిసి తాను మంచి భాగస్వామ్యం నిర్మించాలని తెలిపాడు.తొందరపడకుండా మ్యాచ్ ను ఆఖరి వరకు తీసుకెళ్లాలని తాను సూర్య అనుకున్నట్లు కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.

కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో భారత జట్టు సెప్టెంబర్ 24 రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది.రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు సెప్టెంబర్ 27న మూడో వన్డే మ్యాచ్ ఆడనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube