కరాటే( Karate ) ఆత్మరక్షణ నైపుణ్యాలను నేర్పుతుంది.ఏవైనా ప్రమాదకర పరిస్థితులలో మనల్ని మనం కాపాడుకోవడానికి కరాటే మార్షల్ ఆర్ట్స్ ఉత్తమంగా నిలుస్తుంది.
ఇదొక్క ప్రయోజనమే కాకుండా కరాటే వల్ల చాలానే ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక గొప్ప మార్గం.
ఏకాగ్రత, క్రమశిక్షణ, విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.
కరాటే మీ బలం, హార్ట్ ఫిట్నెస్, కోఆర్డినేషన్, బ్యాలెన్స్, యాక్టివ్ నెస్ మెరుగుపరుస్తుంది.కరాటే ఫోకస్, క్రమశిక్షణ, ఏకాగ్రత, సెల్ఫ్ కంట్రోల్ స్కిల్స్ పెంచుకోవడంలోనూ చాలా బాగా హెల్ప్ అవుతుంది.ఇది ఒత్తిడి( Pressure ), ఆందోళనను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
కరాటే బాగా నేర్చుకుంటే కాన్ఫిడెన్స్, ఆత్మగౌరవం పెరుగుతుంది.
కరాటే అన్ని వయసుల వారికి, ఫిట్నెస్ స్థాయిల వారికి గొప్ప ఫిజికల్ యాక్టివిటీ( Physical Activity ) అవుతుంది.
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఒక ఆహ్లాదకరమైన మార్గం.బాడీని మంచి షేప్‌లో ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి మానసిక అనారోగ్య సమస్యలు రాకుండా నిరోధించడానికి కరాటేకి మించిన మంచి యాక్టివిటీ మరొకటి ఉండదు.
ఆడవారికి కూడా కరాటే ఉత్తమంగా నిలుస్తుంది.ఈ రోజుల్లో ఎవరు లైంగిక దాడి చేస్తారో తెలియని పరిస్థితి కాబట్టి అనుకోని పరిస్థితుల నుంచి బయట పడేందుకు ఈ మార్షల్ ఆర్ట్స్( Martial Arts ) సహాయపడుతుంది.పంచ్ చేయడం, తన్నడం, ఇతరులను దగ్గరికి రానివ్వకుండా ఆపడం ఎలాగో నేర్చుకుంటారు.కరాటేలో కత్తి వంటి ఆయుధాలను ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకుంటారు.కరాటే ఒక గొప్ప కార్డియోవాస్కులర్ వ్యాయామం.దీనివల్ల గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
కరాటే గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటే, ఆన్లైన్( Online Karate Classes )లో లేదా స్థానిక కోచ్ ల దగ్గరికి వెళ్ళవచ్చు.జిమ్‌లు, మార్షల్ ఆర్ట్స్ స్టూడియోలు, కమ్యూనిటీ సెంటర్లలో కరాటే క్లాసులు కనుగొనవచ్చు.
కరాటే బేసిక్స్ బోధించే పుస్తకాలు, డీవీడీలు, ఆన్లైన్ సోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి.