మోడీ సర్కార్ కు భయం అందుకేనా ?

వచ్చే సార్వత్రిక ఎన్నికల విషయంలో మోడీ ( Narendra Modi )సర్కార్ భయపడుతోందా ? విపక్ష కూటమే అందుకు కారణమా ? జమిలి ఎన్నికల వైపు అడుగులు అందుకేనా ? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.ఎందుకంటే ఒన్ నేషన్.

 Is That Why The Modi Government Is Afraid , Narendra Modi , Jamili Elections ,-TeluguStop.com

ఒన్ ఎలక్షన్ విధానంతో దేశంలోని అన్నీ రాష్ట్రాలకు ఒకే సారి ఎలక్షన్స్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై మోడీ సర్కార్ గత కొన్నాళ్లుగా కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇక తాజాగా జమిలి ఎన్నికల( Jamili Elections ) విషయంలో కేంద్రం గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెత్న్ సమావేశాలు నిర్వహింనుండగా ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టె అవకాశం ఉందట.

Telugu Assembly, Brs, Congress, Jamili, Narendra Modi, Ram Nath Kovind, Ycp-Poli

అంతే కాకుండా జమిలి ఎన్నికల అమలుకు ఎదురయ్యే అడ్డంకులు చిక్కులు వంటివాటిని పూర్తిగా ఎలా ఎదుర్కోవలనే దానిపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్( Ram Nath Kovind ) అధ్యక్షతన ఓ కమిటీని కూడా వేయబోతున్నట్లు సమాచారం.దీన్ని బట్టి చూస్తే జమిలి విధానంపై కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) జరగనున్నాయి.

అలాగే వచ్చే ఏడాది జరగాల్సిన పార్లమెంట్ ఎలక్షన్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, వంటి రాష్ట్రాలల్లో ఎన్నికలు జరగనున్నాయి.అలాగే వచ్చే ఏడాది చివర్లో మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జగనున్నాయి.

అందువల్ల వీటన్నిటిని కలిపి 12 రాష్ట్రాలకు ఒకేసారి పార్లమెంట్ ఎలక్షన్స్ తో పాటు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై కేంద్రం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Telugu Assembly, Brs, Congress, Jamili, Narendra Modi, Ram Nath Kovind, Ycp-Poli

అయితే ఇప్పటికిప్పుడు జమిలి ఎలక్షన్స్ ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఏముందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.ముఖ్యంగా విపక్ష ఇండియా కూటమి బలపడుతుండడంతో ఓటమి భయంతోనే మోడీ సర్కార్ జమిలి వైపు వెళుతోందనేది విపక్షాలు చెబుతున్నా మాట.అయితే గత ఎన్నికల తరువాత పలుమార్లు మోడీ జమిలి ఎన్నికల విధానాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారే తప్పా అమలు దిశగా అడుగులు వేయలేదు.కానీ నాలుగేళ్ల తరువాత ఇప్పుడు పూర్తి స్థాయిలో గట్టిగా జమిలి ఎలక్షన్స్ పై దృష్టి సారించారు.మరి మోడీ సర్కార్ ఓటమి భయంతోనే జమిలి వైపు అడుగులు వేస్తోందా లేదా ఇంకా ఏమైనా వ్యూహాలు ఉన్నాయా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube