షాకింగ్ వీడియో.. కాళ్లతో వంట.. ఛీ.. ఛీ.. మరీ ఇంత దారుణమా..?

హాస్టళ్లల్లో ( Hostels ) వంట ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు.నాసిరకంగా వంటలు వండుతూ ఉంటారు.

 Unhygenic Cooking With Legs In Haryana University Canteen Details, Cooking With-TeluguStop.com

వంటలను చూస్తే తినాలనిపించదు.దీంతో చాలామంది బయటకెళ్లి ఫుడ్ తినడమో లేదా ఆర్డర్ పెట్టుకోవడమో చేస్తూ ఉంటారు.

అలాగే హాస్టళ్లల్లో వంటలు చేసేటప్పుడు చూస్తే ఫుడ్ కూడా తినాలనిపిచందు.శుభ్రత అసలు పాటించరు.

వీటికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి.తాజాగా అలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

హాస్టల్‌లో విద్యార్థులకు ఆహారాన్ని తయారుచేయడానికి ఒక వ్యక్తి కాళ్లను ( Legs ) ఉపయోగిస్తున్న వీడియో అందరినీ విస్తుగొల్పుతోంది.హర్యానాలోని( Haryana ) ఒక ప్రైవేట్ యూనివర్సిటీ క్యాంటీన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.ఆలుగడ్డలు ( Potatoes ) ఉడికించిన తర్వాత సాకుతో కట్ చేయకుండా వాటిని ఒక గిన్నెలో వేసి ఒక వ్యక్తి కాళ్లతో తొక్కుతున్నాడు.క్యాంటీన్ లోని ఈ ఘటనలను విద్యార్థులు రికార్డ్ చేయగా.

ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు బయటకొచ్చాయి.హర్యానాలోని ఒపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలస్తోంది.

ఈ వ్యవహారంలో బయటపడటంతో అసలు క్యాంటీన్ లోని పుడ్ ను తినడమే విద్యార్థులు మానేశారు.

ఆలుగడ్డలను ఉడికించిన తర్వాత వాటిని మొత్తగా చేసేందుకు కాళ్లతో తొక్కుతుండగా కొంతమంది విద్యార్థులు గమనించారు.దీంతో దీనిని అందరికీ తెలియజేసేందుకు తమ ఫోన్ కెమెరాల్లో దృశ్యాలను రికార్డ్ చేశారు అనంతరం సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.దీంతో కాలేజీ విద్యార్థులందరికీ క్యాంటీన్( Canteen ) వ్యవహారం బయటపడింది.

క్యాంటీన్ సిబ్బందిపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు.ఇంత దారుణంగా వంట చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై యూనివర్సిటీ యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేస్తున్నారు.క్యాంటీన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, వారిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube