నంద్యాల జిల్లా శ్రీశైలంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఎలుగుబంటి చిక్కింది.ఎలుగుబంటి సంచారం నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు శిఖరేశ్వరం దగ్గర బోను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
గత నాలుగు రోజులుగా శిఖరేశ్వరంలో ఎలుగుబంటి సంచరిస్తుంది.ఈ క్రమంలో ప్రత్యేక బృందంతో అధికారులు ఎలుగుబంటిని బంధించారు.
అనంతరం వెలుగోడు అటవీ ప్రాంతానికి ఎలుగుబంటిని తరలించారు.అధికారులు ఎలుగుబంటిని పట్టుకోవడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.