ఫైర్ రోబోట్ గురించి విన్నారా? మంటలను ఇట్టే ఆర్పేస్తుంది!

టెక్నాలజీ( Technology ) కొత్త పుంతలు తొక్కుతోంది.మనిషిని ప్రగతి పథంలోకి నడిచేలా దోహదపడుతోంది.

 Heard Of Fire Robot? It Will Put Out The Fire! Fire, Robot, Latest News ,fire Ac-TeluguStop.com

ఈ క్రమంలో ఉద్భవించినవే రోబోలు.అవును, నేడు రోబోటిక్ టెక్నాలజీ అనేక రంగాల్లో దూసుకుపోతోంది.

మనుషులు చేయవలసిన పనులను రోబోస్ చేసేస్తున్నాయి.నేటి దైనందిత జీవితంలో దాదాపు అన్ని చోట్ల తరుచుగా అగ్నిప్రమాదాలు అనేవి సంభవిస్తుంటాయి.

ఇరుకైన ప్రదేశాల్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు.వాటిని నియంత్రించేందుకు ఫైర్ సిబ్బందికి చాలా కష్ట పడాల్సి వస్తుంది.

అలాంటి సందర్భాల్లో అగ్నిమాపక దళాలకు సాయంగా పనిచేసే రోబోను ఓ యువకుడు తయారు చేశాడు.

అవును, ఆ రోబో మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు కూడా వెళ్లి మంటలను అదుపులోకి తీసుకురాగలదు.

వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్‌( Madhya Pradesh )లోని ఇండౌర్‌కు చెందిన 21 ఏళ్ల మనుజ్‌ జైశ్వాల్‌( Manuj Jaishwal ) అనే యువకుడు మంటలను అదుపు చేసేందుకు ఓ మినీ రోబోను తయారు చేశాడు.ఇరుకైన వీధులు, ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు.

ఈ రోబో వినియోగంతో మంటలను సులువుగా అదుపులోకి తేవచ్చని మనుజ్ జైశ్వాల్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.ఫైర్‌ సిబ్బందికి ప్రమాదాలు కూడా తగ్గుతాయని అతడు పేర్కొన్నాడు.

చూడటానికి రిమోట్‌ కారులా ఉండే ఈ రోబోకు పైన కార్బన్‌ డై ఆక్సైడ్‌ సిలిండర్‌ను అమర్చడం ఇక్కడ ఫొటోలో మనం చూడవచ్చు.దాన్ని రిమోట్‌ కంట్రోల్‌తో ఆపరేట్‌ చేసేలా జైశ్వాల్ డిజైన్‌ చేశాడు.

ఈ రోబో ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందనీ ఈ యంత్రాలనే పెద్దగా తయారు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటాయని జైశ్వాల్‌ స్థానిక మీడియాతో మాట్లాడాడు.ప్రస్తుతం జైశ్వాల్ ఆటోమేషన్ రోబోటిక్స్‌లో ఇంజనీరింగ్‌ను కోర్సుని చదువుతున్నాడు.

ఈ రోబోతో మంటలను ఆర్పడం మాత్రమే చేయగలమనీ.అయితే కృత్రిమ మేథతో పనిచేసే రోబో తయారు చేసి.

అగ్ని ప్రమాదాలు నివారించడం గురించి ఆలోచిస్తున్నానని అతడు ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube