రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వంత జాగాలో లబ్ధిదారులకు మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలనీ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ ( N Khemya Naik )ఇంజనీరింగ్ అధికారులను అదేశించారు.కలెక్టరేట్లోని తన చాంబర్లో సొంత జాగాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరైన వాటి ప్రగతిని జిల్లా కలెక్టర్ ఆర్ అండ్ బి ,పంచాయతీరాజ్, ఇరిగేషన్ ,సాంఘిక సంక్షేమ శాఖ కార్యనిర్వాక ఇంజనీర్లతో సమీక్షించారు.
జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలోని 5 మండలాల్లోని 997 మంది లబ్ధిదారులకు వారి స్వంత జాగాలో నిర్మించేందుకు వీలుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది అన్నారు.వీటికి సంబంధించి సంబంధిత ప్రభుత్వ శాఖల ఇంజనీర్లు టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకుని వారం రోజుల్లోగా పనులు ప్రారంభించాలని చెప్పారు.
నిర్మాణ పనులు పూర్తయిన ఇళ్లకు సంబంధించి సరిత గతిన చెల్లింపులు చేసేందుకు వీలుగా బిల్ లను సమర్పించాలని చెప్పారు.అలాగే జిల్లాలో 3514 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయ్యాయని.
పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్న కాలనీలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇంజనీర్లను ఆదేశించారు.లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా అన్ని మౌలిక సదుపాయాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభోత్సవానికి సర్వసన్నద్ధం చేయాలన్నారు.
ఈ సమావేశంలో కార్యనిర్వాక ఇంజనీర్ సూర్యప్రకాష్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ , సోషల్ వెల్ఫేర్,పిఆర్ డీఈఈ,ఎ ఈ ఈ లు, హౌసింగ్ ఏ ఈ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు
.