ఇంట్లోనుండే బ్యాంకు సేవలు పొందండి... అలా చేస్తే అధికారులే మీ ఇంటికొస్తారు!

డిజిటల్ ఇండియా( Digital India ) అనే నినాదాన్ని కేంద్రం ఏనాడు మొదలు పెట్టిందోగాని అప్పటినుండి డిజిటల్ ఇండియా సూత్రం అనేది ఇక్కడ దినదినాభివృద్ధి సాధించింది.అవును, ఇక్కడ దాదాపుగా ఆర్థిక వ్యవహారాలు సాగించడానికి డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది శరవేగంగా డెవలప్ అవుతోంది.

 Get Banking Services From Home Officials Will Visit Your Home If You Do, Banking-TeluguStop.com

అయితే ఈ క్రమంలో కొన్ని అవసరాలకు బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తోన్న మాట వాస్తవం.అయితే ఇక్కడ ముఖ్యంగా వయసు పైబడిన వారు తమ పెన్షన్ తీసుకోవానికి, లేదా ఫిక్స్ డ్ డిపాజిట్ చేసుకోవడానికి బ్యాంకులో పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు.

కానీ ఒక్కోసారి వారు బ్యాంకుకి వెళ్లే పరిస్థితి ఉండదు.మరికొందరు నడవలేని పరిస్థితి ఉంటుంది.

అయితే దానికి ఇపుడు ప్రత్యామ్నాయం వచ్చింది.

Telugu Bank Officials, Doorstep, Latest-Latest News - Telugu

అలాంటివారు బ్యాంకుకు వెళ్లకుండానే బ్యాంకునే ఇంటికి రప్పించుకునే మార్గం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? అవును, బ్యాంకుకు సంబంధించిన అధికారులను ఇంటికి రప్పించుకునే వెసులుబాటు కలదు.డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్( Door step banking service ) గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.కానీ దీని ద్వారా బ్యాంకులు కొన్ని సర్వీసులు ఇంటికి వచ్చే చేస్తుందన్నమాట.

అయితే దానికి కొన్ని నియమ నిబంధనలు అనేవి వున్నాయి.బ్యాంకుతో సర్వీస్ చేసుకునే వ్యక్తి వయసు 70 సంవత్సరాలు పైబడి ఉండాలి.

ఒకవేళ 70 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నా.వికలాంగుడు అయి ఉండాలి.

దీంతో వీరికి సంబంధించిన వాళ్లు బ్యాంకులో ముందుగా సమాచారం ఇస్తే కొందరు అధికారులను ఇంటికి పంపి సర్వీసు చేయిస్తుంది.

Telugu Bank Officials, Doorstep, Latest-Latest News - Telugu

అయితే దీనికి కొంత చార్జీ వసూలు ( Charge collection )అనేది ఉంటుందని మర్చిపోవద్దు.అయితే ఆ చార్జీల విషయంలో పెద్దగా భయపడాల్సిన పనిలేదు.ఎందుకంటే ఇక్కడ నామమాత్రపు ఫీజులు ఉంటాయి.

అత్యవసర సర్వీసులు చేయించుకునేవారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది.ఇక్కడ మరొక విషయం గమనించాలి.

ఫీజులు గురించి భయపడేవారు బ్యాంకుకు వెళ్లాలంటే ప్రయాణ సాధనాలకు చార్జీలు చెల్లించాలి కదా.దాదాపు అంతే చార్జీలతో ఇంట్లోనే బ్యాంకు ద్వారా మీ అవసరాలు తీర్చుకోవచ్చు.అయితే ఇలా సర్వీస్ చేయించుకునేవారి ఇల్లు బ్యాంకుకు 5 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉండాలని మర్చిపోవద్దు సుమా!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube