వెస్టిండీస్ తో జరిగిన వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత ఆటగాళ్లు వీళ్లే..!

ఇప్పటివరకు భారత్-వెస్టిండీస్( India vs WI ) మధ్య 139 వన్డే మ్యాచ్లు జరిగాయి.భారత్ వన్డేలలో వెస్టిండీస్ పై చేయి సాధించింది.

 Top 5 Indian Cricketers With Highest Runs In Odi Against West Indies Details, To-TeluguStop.com

వెస్టిండీస్ జట్టుపై భారత్ 70 మ్యాచ్లు గెలిచింది.వెస్టిండీస్ జట్టు భారత్ పై 63 మ్యాచ్లు గెలిచింది.

ఈ మ్యాచ్లలో భారత ఆటగాళ్లు చెలరేగి అద్భుతమైన పరుగులు చేశారు.వెస్టిండీస్ పై వన్డే మ్యాచ్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.ఆ తరువాత స్థానాలలో రోహిత్ శర్మ, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరబ్ గంగూలీ ఉన్నారు.

విరాట్ కోహ్లీ:

కోహ్లీ( Virat Kohli ) 2009 నుండి వెస్టిండీస్ తో 42 వన్డే మ్యాచ్లు ఆడాడు.ఇందులో 41 ఇన్నింగ్స్ లలో 66.50 సగటుతో 2261 పరుగులు చేశాడు.ఇందులో తొమ్మిది సెంచరీలు, 11 అర్థ సెంచరీలు ఉన్నాయి.

Telugu India, Rahul Dravid, Rohit Sharma, Tendulkar, Sourav Ganguly, Top Cricket

రోహిత్ శర్మ:

రోహిత్ శర్మ( Rohit Sharma ) 2009 నుండి వెస్టిండీస్ తో 36 మ్యాచులు ఆడాడు.ఇందులో 34 ఇన్నింగ్స్ లలో 57.17 సగాటుతో 1601 పరుగులు చేశాడు.ఇందులో మూడు సెంచరీలు, 12 అర్థ సెంచరీలు ఉన్నాయి.

Telugu India, Rahul Dravid, Rohit Sharma, Tendulkar, Sourav Ganguly, Top Cricket

సచిన్ టెండూల్కర్:

సచిన్ టెండూల్కర్( Sachin ) వెస్టిండీస్ తో 1991 నుంచి 2011 మధ్య 39 వన్డే మ్యాచ్లు ఆడాడు.39 ఇన్నింగ్స్ లలో 52.43 సగటుతో 1573 పరుగులు చేశాడు.ఇందులో నాలుగు సెంచరీలు, 11 అర్థ సెంచరీలు ఉన్నాయి.

Telugu India, Rahul Dravid, Rohit Sharma, Tendulkar, Sourav Ganguly, Top Cricket

రాహుల్ ద్రావిడ్:

రాహుల్ ద్రావిడ్( Rahul Dravid ) వెస్టిండీస్ తో 1997 నుంచి 2009 మధ్య 40 మ్యాచ్లు ఆడాడు.38 ఇన్నింగ్స్ లలో 42.12 సగటుతో 1348 పరుగులు చేశాడు.ఇందులో మూడు సెంచరీలు, ఇది అర్థ సెంచరీలు ఉన్నాయి.

Telugu India, Rahul Dravid, Rohit Sharma, Tendulkar, Sourav Ganguly, Top Cricket

సౌరవ్ గంగూలీ:

గంగూలీ( Sourav Ganguly ) 1992 నుంచి 2007 మధ్య వెస్టిండీస్ తో 27 వన్డేలు ఆడాడు.27 ఇన్నింగ్స్ లలో 47.58 తో సగటు తో 1142 పురుగులు చేశాడు.ఇందులో 11 అర్థ సెంచరీలు ఉన్నాయి.

ఇక తాజాగా జులై 27న భారత్- వెస్టిండీస్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube