పుల్లంపేట రోడ్డు ప్రమాదం పై స్పందించిన పవన్ కళ్యాణ్..!!

అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందటం తెలిసిందే.ఈ ప్రమాద ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం.

మృతులకు ₹10 లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షలు స్వల్పంగా గాయాలైన వారికి ₹50 వేలు చొప్పున బాధిత కుటుంబాలకు సాయం ప్రకటించారు.ఇదే ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.“కడప నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సును పుల్లంపేట దగ్గర లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడటం బాధాకరం.

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.గాయాల పాలైన పది మందికీ మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను కోరుతున్నాను.మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొని, తగిన ఆర్థిక సహాయం అందించాలి.

సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ అతి వేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని వివిధ మాధ్యమాల ద్వారా తెలిసింది.పోలీసు, రవాణా శాఖల అధికారులు రహదారి భద్రత చర్యల్లో భాగంగా వేగ నియంత్రణపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది” అని పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube