ప్రస్తుతం యువత సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్న స్మార్ట్ వాచ్ లను ఉపయోగించడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు.గతంలో వాడే వాచ్లు కేవలం టైమ్ చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు.
కానీ ప్రస్తుతం స్మార్ట్ వాచ్( Smart watch ) లలో ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయడం, నోటిఫికేషన్ తనిఖీ చేయడం, కొన్ని ముఖ్యమైన ఆరోగ్య భద్రత సూచనలు లాంటి ఫీచర్లతో వస్తున స్మార్ట్ వాచ్లకు యువత అట్రాక్ట్ అవుతున్నారు.
ప్రముఖ స్మార్ట్ వాచ్ కంపెనీలు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఉండే విధంగా సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లను తయారు చేసి ఎప్పటికప్పుడు మార్కెట్లో విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించే పనిలో పడ్డారు.
ఈ క్రమంలోనే హామర్ కంపెనీ( Hammer Company ) నుంచి మరో రెండు సరికొత్త స్మార్ట్ వాచ్ లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి.ఆ స్మార్ట్ వాచ్ ల ఫీచర్లు, ధర వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
హామర్ సైక్లోన్:( Hammer Cyclone ) ఈ వాచ్ 1.39 అంగుళాల వృత్తాకార డిస్ ప్లే లో ఉంటుంది.ఈ వాచ్ 600 నిట్స్ బ్రైట్ నెస్ కు సపోర్ట్ చేస్తుంది.ఇది 4 రిమూవబుల్ స్ట్రిప్స్ తో వస్తుంది.బ్లూ టూత్ కలెక్టివిటీ, అంతర్నిర్మిత స్పీకర్, మైక్రో ఫోన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.ఈ వాచ్ లో 100కు పైగా స్పోర్ట్స్ మోడ్, 100కు పైగా వాల్ పేపర్లు ఉన్నాయి.ఐపీ 67 నీటి నిరోధకత కలిగిన ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.2399.
హామర్ యాక్టిివ్ 2.0:( Hammer Active 2.0 ) ఈ వాచ్ 1.92 అంగుళాల డిస్ ప్లే, 600 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది.ఈ వాచ్లో 50 కాంటాక్ట్స్ ను సేవ్ చేసుకోవచ్చు.మెటాలిక్ బాడీతో పాటు డిటాచబుల్ సిలికాన స్ట్రిప్ తో ఉన్న ఈ వాచ్ బ్లూ టూత్ కనెక్టివిటీతో ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇందులో హృదయ స్పందన రేటు, నిద్ర పర్యవేక్షణ, రక్తపోటు, ఉష్ణోగ్రత, మహిళల రుతుచక్ర ట్రాకింగ్, ఎస్పీఓ2 లాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.ఈ వాచ్ ధర రూ.1899.