ప్రస్తుత కాలంలో యువత విపరీతంగా ఆన్ లైన్ గేమ్ లకు( Online Games ) అడిక్ట్ కావటంతో పాటు డబ్బులు పోగొట్టుకొని చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.ఆన్లైన్ గేమ్ అనేది ఒక ప్రమాదకరమైన వ్యసనంగా మారింది.
అత్యాశతో డబ్బు అప్పుచేసి ఆన్లైన్ గేమ్స్ ఆడడం, అప్పు తీర్చలేక చివరికి ఆత్మహత్యలు చేసుకోవడం ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది.
కేంద్ర ప్రభుత్వం( Central Govt ) ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో ఆన్లైన్ గేమ్స్ వ్యసనానికి బానిస అయిన వారికి విముక్తి లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్( Nirmala Sitaraman ) తెలిపారు.ఢిల్లీ లో మంగళవారం 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది.
అందులో ఆన్ లైన్ గేమ్స్, కేసినో, హార్స్ రేసింగ్ లాంటి వాటిపై 28% జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయంపై కౌన్సిల్ సభ్యులు సంపూర్ణ ఆమోదం తెలిపారు.
ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే.? యువతతో పాటు చిన్న పిల్లలు కూడా ఈ ఆన్లైన్ గేమ్స్ బారిన పడి డబ్బులు పోగొట్టుకొని మానసికంగా కృంగిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.జీఎస్టీ ( GST ) విధించడం వల్ల చాలామంది ఈ ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్ళరని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
అంతేకాకుండా సినిమా థియేటర్లలో అమ్మే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ లాంటి ఆహార పదార్థాలపై పన్ను రేటు 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.రూ.100 కంటే ఎక్కువగా ఉండే సినిమా టికెట్లపై 18 శాతం జీఎస్టీ విధించారు.ఇక క్యాన్సర్ మందులకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభించింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.