ఇంక మీరు మారారా ? హీరోతో షర్మిల అఫైర్లు పెట్టుకున్నట్లు జోరందుకున్న కామెంట్స్..

సినిమా వాళ్ల గురించి చాలా సింపుల్‌గా పుకార్లు పుట్టుకొస్తుంటాయి.సెలబ్రిటీల( Celebrities ) మధ్య ఏమీ లేకపోయినా ఏదో ఉందన్నట్లు సంచలన ఆరోపణలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి.

 Again Rumors Started About Sharmila And Prabhas , Ys Sharmila, Prabhas, Ys Raja-TeluguStop.com

సినిమా వాళ్లకు బయట వ్యక్తులతో రిలేషన్ ఉన్నట్లు కూడా కొందరు ఫేక్ వార్తలను సృష్టిస్తుంటారు.ఈ అబద్ధాలే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తూ సెలబ్రిటీల గౌరవానికి భంగం కలిగిస్తాయి.

ఈ అబద్ధాలే నిజమన్నట్లు ఆ సెలబ్రిటీల ప్రత్యర్ధులు మాటిమాటికీ పలకడం వారి మనసును ఎంతో గాయపరుస్తుంటుంది.

ఇలాంటి నిరాధార రూమర్ల వల్ల బాగా సఫర్ అయిన వారిలో వైఎస్ షర్మిల( YS Sharmila ) కూడా ఉన్నారు.

దివంగత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhar Reddy )ముద్దుల కూతురు అయిన షర్మిల ప్రభాస్‌తో రిలేషన్ పెట్టుకున్నట్లు 2014 నుంచి ఫేక్ వార్తలు మొదలయ్యాయి.వీటిని ఎందుకు సృష్టించారు, ఏ చెడు ఉద్దేశంతో మొదలుపెట్టారనేది తెలియ రాలేదు.

కానీ ఇలా ఒక మహిళా క్యారెక్టర్‌కు మచ్చ వచ్చేలా పుకార్లు సృష్టించడం అందరినీ కలిచి వేసింది.ఆమె చేసే పనులను విమర్శిస్తే ఓకే కానీ ఇలా పర్సనల్‌గా టార్గెట్ చేయడం ఏమాత్రం అంగీకరించదగినది కాదని చాలామంది అప్పట్లో, ఇప్పట్లో అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉంటారు.

Telugu Rumorssharmila, Airport, Venkatesh, Prabhas, Sharmila, Ysrajasekhar, Ys S

రీసెంట్‌గా షర్మిల తన కొడుకుతో కలిసి ఎయిర్‌పోర్ట్( Airport ) నుంచి వస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ సందర్భంగా కూడా కొందరు నీచులు “షర్మిల కుమారుడు ప్రభాస్ లాగా ఉన్నాడేంటి” అంటూ తప్పుడు కూతలు కూశారు.నిజానికి ఒక పుకారు విన్న తర్వాత అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అని తెలుసుకోకుండా దానిని త్వరగా ఇతరులకు షేర్ చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు.అందుకే అబద్ధాలే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తుంటాయి.

Telugu Rumorssharmila, Airport, Venkatesh, Prabhas, Sharmila, Ysrajasekhar, Ys S

వాస్తవానికి ప్రభాస్ షర్మిల కంటే చాలా చిన్నవాడు.అతను డిగ్రీలో ఉన్న సమయంలోనే షర్మిల పెళ్లి చేసుకున్నారు.ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు.తర్వాత బిజినెస్, రాజకీయాలంటూ ఆమె తన జీవితాంతం బిజీ అయిపోయారు.అలా గౌరవంగా బతుకుతున్న షర్మిలకు ప్రభాస్‌తో సంబంధం అంటగట్టిన వారిని పోలీసులు పట్టుకున్నారు.అది కూడా షర్మిల ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేశారు.

దాంతో పోలీసులు కేసు నమోదు చేసి ఐపీ అడ్రస్ ఆధారంగా ప్రకాశం జిల్లాకు చెందిన పి.వెంకటేశ్( P.Venkatesh ) అనే ఎంసీఏ విద్యార్థితోపాటు మరొక వ్యక్తి అరెస్టు చేశారు.వారిపై ఐపీసీ సెక్షన్ 509 (మహిళల గౌరవానికి భంగం కలిగించడం), ఐటీ చట్టం 67 (నిరాధారిత సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేయడం)ల కింద కేసులు నమోదు చేశారు.

ఇది జరిగింది నాలుగేళ్ల కిందట.ఇది జరిగిన తర్వాత కూడా ఆ అసంబద్ధమైన పుకారును ప్రస్తావిస్తూ షర్మిలపై కొందరు అవమానకరంగా కామెంట్స్ చేస్తున్నారు.స్వయంగా ప్రభాస్ ఈ విషయంపై స్పందిస్తూ ఇదంతా అబద్ధమని చెప్పాడు.అయినా అది పట్టించుకోకుండా తప్పు చేయని ఆమెను కొందరు విమర్శిస్తూ ఆనందం పొందుతున్నారు.

ఏది ఏమైనా వేరే వారి గురించి ప్రచారంలో ఉన్నది నిజమా అబద్దమా అనేది ఆలోచించి మాట్లాడే విచక్షణ చాలామందికి లేకుండా పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube