బిజెపి( BJP ) ఎన్నడూ లేని విధంగా సౌత్ రాష్ట్రాలపై గట్టిగానే ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.పార్టీకి చెందిన పెద్దలంతా కూడా సౌత్ రాష్ట్రాలలో వరుస పర్యటనలు చేస్తున్నారు.
ప్రధాని మోడీ మొదలుకొని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా( President JP Nadda ) వరకు నిత్యం ఏదో ఒక సౌత రాష్ట్రంలో పర్యటిస్తూనే ఉన్నారు.ఈ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాలపై కాషాయ పెద్దలు ఫోకస్ చేయడానికి కారణం కూడా లేకపోలేదు.
ఎన్నో ఏళ్లుగా దక్షిణాదిలో స్థిరపడాలని బీజేపీ కలలు కంటూనే ఉంది.కానీ ప్రాంతీయ భాషాభిమానం ఉన్న దక్షిణాది ప్రజలు బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు.
దాంతో ఎన్ని ప్రయత్నాలు చేసిన దక్షిణాదిలో మాత్రం సత్తా చాటడం లేదు బీజేపీ.ఇక పోతే మొన్నటి వరకు చెప్పుకోవడానికి కర్నాటక( Karnataka ) రాష్ట్రమైన ఉండేది.
కానీ ఇటీవల జరిగిన ఎన్నికలతో కర్ణాటక కూడా చేజారిపోయింది.ఇక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ వంటి రాష్ట్రాలలో అసలు బిజెపి ఉందా అన్న ప్రశ్న కూడా రాకమానదు అంతో ఇంతో తెలంగాణలో కమలం పార్టీ ప్రస్తుతం కొంత మెరుగ్గా ఉంది.
ఈ నేపథ్యంలో పార్టీని దక్షిణాదిలో బలపరిచేందుకు బీజేపీ గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.ఈ ఏడాది మరియు వచ్చే ఏడాది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) జరగనున్నాయి.ఆ ఎలక్షన్స్ టార్గెట్ కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోంది.అలాగే ఏపీలో కూడా బలపడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఇక పోతే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండడంతో దక్షిణాది రాష్ట్రాలు కీలకంగా మారనున్నాయి.ఈ నేపథ్యంలో సౌత్ లో సత్తా చాటడానికి కొత్త ఎత్తుగడలకు తెర తీస్తోంది కాషాయ పార్టీ.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ సౌత్ నుంచి పోటీ చేస్తే.
పార్టీకి మైలేజ్ పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే మోడీని ఈసారి తమిళనాడు నుంచి రంగంలోకి దింపాలనే ప్లాన్ లో బిజెపి ఉందట.
ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తమిళనాడు నుంచి పోటీ చేయడం ఖాయమైంది.ఇప్పుడు మోడీ కూడా తమిళనాడు వైపే చూస్తున్నాడనే టాక్ రావడంతో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది.
కుదిరితే కన్యాకుమారి లేదంటే కోయంబత్తూర్( Coimbatore ) నుంచి మోడీ బరిలో నిలుస్తారని జాతీయ మీడియా కొడై కుస్తోంది.మోడీ సౌత్ నుండి పోటీ చేస్తే ఆయనకున్న ప్రజాబలం కారణంగా సౌత్ రాష్ట్ర ప్రజల చూపు మోడీ వైపు పడే అవకాశం ఉంది అప్పుడు బిజెపికి మైలేజ్ పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే మౌడీ తమిళనాడు నుంచి బరిలోకి దిగుతాడనే వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని, ఇదే గనుక నిజం అయితే బీజేపీ ” మిషన్ సౌత్ ” ను గట్టిగానే ప్లాన్ చేస్తుందనే చెప్పాలి.