ఆ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ గోపీచంద్ మలినేని.. వర్కౌట్ అయ్యేనా?

ప్రస్తుత కాలంలో ఒక సినిమా తెరకెక్కుతోంది అంటే అందులోఒక జంతువును ప్రధానంగా చేసి చూపిస్తుంటారు.ఒకానొక సమయంలో హీరోలను ఇంట్రడ్యూస్ చేయాలంటే పులి లేదా సింహాలను ఆధారంగా ఈ జంతువుల చుట్టే సినిమా కథ మొత్తం తిరిగేలా ప్లాన్ చేసేవారు.

 Ravi Teja Gopichand Malineni Is Going To Come In Front Of The Audience,balagam,g-TeluguStop.com

అనంతరం గుర్రాలను తెరపైకి తీసుకువచ్చారు.ఇలా గుర్రాలతో సినిమా కథ మొత్తం ముందుకు సాగేలా ఈ గుర్రాలు సినిమాలలో కీలక పాత్ర పోషించేలా సినిమాలను ప్లాన్ చేస్తున్నారు.

ఇలా ఒక సినిమా మొత్తం ఏదైనా జంతువు లేదా పక్షి చుట్టూ తిరగడం మనం చూస్తున్నాము.

ఇలా ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ అందుకున్నటువంటి సినిమాలలో కాకి(Crow) చాలా సెంటిమెంట్ గా మారిపోయింది.వేణు డైరెక్షన్లో వచ్చిన బలగం( Balagam ) సినిమాలో కాకి ప్రధానంగా మారింది.ఈ సినిమా మొత్తం కాకి చుట్టే తిరుగుతుంది.

అలాగే నాచురల్ స్టార్ నాని (Nani)నటించిన దసరా సినిమా( Dasara Movie ) లో కూడా కొన్ని కాకికి సంబంధించినటువంటి సీన్లు ఉన్నాయి.తాజాగా మెగా హీరో సాయి ధరంతేజ్ (Sai Dharam Tej) నటించిన విరూపాక్ష( Virupaksha ) సినిమాలో కూడా కాకి ప్రధానంగా నిలిచింది.

ఇలా ఈ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

ఇకపోతే సినీ ఇండస్ట్రీలో మాస్ మహారాజ గా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి రవితేజ( Ravi Teja ) తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని ( Gopichand Malineni ) దర్శకత్వంలో చేయబోతున్నారు.ఇప్పటివరకు వీరిద్దరూ మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి.దీంతో నాలుగో సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం అందరిలోనూ ఉంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా ఇందులో డేంజర్ బోర్డు పైన కాకి కనిపించడం గమనార్హం.ఇలా ఈ సినిమాలో కూడా కాకి ( Crow ) కీలకం కాబోతుందని తెలుస్తోంది.

ఇలా కాకి సెంటిమెంటుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా విషయంలో కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనీ మరోసారి ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube