జనసేనాని మాస్టర్ ప్లాన్.. సక్సస్ అవుతుందా ?

ఏపీ రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తనదైన రీతిలో దూసుకుపోతున్నారు.ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా బలమైన ముద్ర వేయాలని చూస్తున్న పవన్.

 Will Janasena's Master Plan Succeed , Godavari Districts, Pawan Kalyan , Janasen-TeluguStop.com

ఆ దిశగా వేస్తున్న ప్రతి అడుగు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.వైసీపీ సర్కార్ ( YCP )ను గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న జనసేనాని( Janasenani ).ముఖ్యంగా ఉత్తరాదిలో వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు.ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కనివ్వనని శపథం చేశారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో తొలిదశ వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన పవన్.అక్కడి ప్రజలను గట్టిగానే ఆకర్షించారు.

Telugu Ap, Janasena, Janasenani, Janga Gudem, Pawan Kalyan, Janasenasmaster-Poli

కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఉభయగోదావరి జిల్లాల్లో( Godavari districts ) ఈసారి జనసేన ప్రభావం గట్టిగానే చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు.ఉభయ గోదావరి జిల్లాల్లో అభివృద్ది నిమిత్తం మాస్టర్ ప్లాన్ సిద్దం చేసింది జనసేన పార్టీ.అన్నవరం నుంచి జంగారెడ్డి గూడెం( Jangareddy Gudem ) వరకు 28కి పైగా పుణ్య క్షేత్రాలను కలుపుకొని అధ్యాత్మిక పర్యాటక రూట్ గా మారుస్తామని జనసేన ప్రకటిస్తోంది.

అలాగే నర్సాపురం బోట్ రేసింగ్, కోనసీమ రైల్వే లైన్, సకినేటి పల్లి బ్రిడ్జి, లాస్ వెగాస్ తరహాలో భీమవరం డంప్ యార్డ్ నిర్మాణం, సిల్క్ సిటీ గా ఉప్పాడ, ఆద్యాత్మిక నగరంగా పిటాపురం ఏర్పాటు చేస్తామంటూ జనసేన ప్రకటించింది.

Telugu Ap, Janasena, Janasenani, Janga Gudem, Pawan Kalyan, Janasenasmaster-Poli

దీన్ని బట్టి ఉభయగోదావరి జిల్లాలపై జనసేన ఏ స్థాయిలో ఫోకస్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ గట్టిగానే సత్తా చాటింది.అయితే ఈసారి ఎలాగైనా ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి చెక్ పెట్టి జనసేన జెండా ఎగురవేయాలని పవన్ గట్టి పట్టుదలగా ఉన్నారు.

అందులో భాగంగానే జనసేన అధికారంలోకి వస్తే ఉభయగోదావరి జిల్లాలో విషయంలో తీసుకునే స్టాండ్ పై ముందుగానే వెల్లడించారు పవన్.మరి పవన్ ప్లాన్స్ ఎంతవరకు సక్సస్ అవుతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube