ఇల్లు అందంగా ఉండాలంటే ఇంటిని అందమైన షోపీస్ లతో అలంకరిస్తారు.కానీ వాస్తు ప్రకారం షోపీస్ సరైన దిశలో లేదా సరైన స్థలంలో లేకపోతే అది వాస్తు దోషాని( Vastu Dosha )కి దారితీస్తుంది.
అందుకే మీరు కూడా మీ ఇంటిని అలాంటి షోపీసులతో అలంకరించినట్లయితే వెంటనే వాటిని తొలగించడం మంచిది.ఎందుకంటే ఇలాంటి వాస్తు తప్పిదాలు మీ ఇంట్లో అశాంతిని కలుగజేస్తాయి.
అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి.ఇక ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అయితే అడవి జంతువులు, హింసాత్మక పక్షుల ఫోటోలు కూడా ఇంట్లో ఉండకూడదు.

అంతేకాకుండా గద్దలు, గబ్బిలాలు, కాకులు, గుడ్లగూబ లాంటి పక్షుల చిత్రాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచకూడదు.ఇక క్రూరమైన జంతువులు, పక్షులు చిత్రాలను చూసి కుటుంబ సభ్యులు కూడా క్రూరంగా మారుతారని అంటారు.అందుకే ఇలాంటి చిత్రాలు పెట్టడం వలన కుటుంబ సభ్యుల మధ్య క్షేశలు ఏర్పడతాయి.
అలాగే ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొంటుంది.ఇంట్లో వన్నె ప్రాణుల చిత్రాలు, వేటాడే జంతువుల చిత్రాలు ఉంటే వాటిని వెంటనే తొలగించాలి.
ఎందుకంటే వాస్తు ప్రకారం అడవి జంతువుల ఫోటోలు, హింసాత్మక జంతువుల చిత్రాలు ఇంట్లో పెట్టకూడదు.

ఇలాంటి చిత్రాలు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి.అంతేకాకుండా ఇంటి శ్రేయస్సును, ప్రగతిని ఇది ప్రాణాంతకంగా మారుస్తుంది.ఇక చాలామంది తాజ్ మహాల్ చిత్రాన్ని( Taj Mahal ) ఇంట్లో పెట్టుకుంటారు.
ఇక బహుమతిగా కూడా ఇస్తారు.ప్రపంచంలోని ఏడవ వింతగా తాజ్ మహల్ పిలవబడుతున్నప్పటికీ వాస్తు శాస్త్రం(Vastu Shastra ) ప్రకారం దీన్ని ఇంట్లో ఉంచడం నిషేధించబడింది.
ఎందుకంటే తాజ్ మహల్ ముంతాజ్ సమాధి అని చెబుతారు.హిందూ మతంలో ఇంట్లో సమాధి కానీ, సమాధి లాంటి చిత్రాలు, బొమ్మలు కానీ పెట్టడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.
అందుకే ఇలాంటి షోపీస్ లను ఇంట్లో పెట్టకూడదు.అలాగే నీటిలో మునిగిపోతున్న వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వాస్తు శాస్త్రంలో నిషేధించబడింది.