ఒక నటి లేదా అన్నట్టుడు తీసుకున్నారంటే మీడియాకి ఉన్నంత పండగ మరెవ్వరికీ ఉండదు.పెళ్లి చేసుకున్నారు ? ఎలా పెళ్లి చేసుకున్నారు ? ఎంతమంది గెస్ట్ లు వచ్చారు ? ఎంత ఖర్చు చేశారు ? ఎంత తిండి తిన్నారు ? ఎలా వచ్చారు ? ఇలా ప్రతి ఒక్కటి వేస్తారు.ఇక వారు విడాకులు తీసుకుంటే ఊరుకుంటారా ? దేవుడా ఈ విడాకులు ఎందుకు ఇచ్చావురా అని నెత్తి నోరు బాదుకునే వరకు మీడియా సోషల్ మీడియా( Social media ) నేటిజన్స్ వదలనే వదలరు.ఇప్పుడు చూడండి కొణిదెల వారు కూతురు చక్కగా విడాకులు తీసుకుంది.
ఎందుకు ఆలస్యం ఇక మొదలెట్టండి.ట్రోల్స్ జాతర( నోట్: నేను మెగా ఫ్యామిలీ సపోర్టర్ కాదు).

ఏసుక్రీస్తు చెప్పిన ఒక విషయం ఏంటి అంటే మీలో ఏ పాపమూ చేయనివాడు మొదటి రాయి వేయండి అని.మెగా ఫ్యామిలీ వారు ఇప్పటికే విడాకులపై విడాకులు తీసుకుంటున్నారు అని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.నిహారిక విడాకుల వ్యవహారం రాగానే కొణిదల వారింట్లో ఎన్ని విడాకులు జరిగాయో తెలుసా ? మెగా కుటుంబంలో ఎన్ని పెళ్లిళ్లు జరిగాయో తెలుసా ? అంటూ రకరకాల చెత్త న్యూస్ రాసి సోషల్ మీడియాను నింపేస్తారు కానీ మిగతా వారంతా పతివ్రతల అసలు ఆడవాళ్ళ మీద పెద్దింటి కుటుంబాల్లోని స్త్రీల మీద లేదంటే నటీనటుల వ్యక్తిగత జీవితాల మీద పేజ్ వ్యవహారాల మీద దారుణమైన ట్రోల్స్ మొదలు పెట్టడానికి మనలో ఎంత మందికి అర్హత ఉంది.

మిగతా వారి జీవితాలు ఎంతో ఆదర్శంగా ఉన్నట్టు ఇప్పుడు నిహారిక( Niharika)పై కామెంట్స్ చేయడం మొదలుపెడతారు.ఈ తప్పు జరిగినందుకే విడాకులు వచ్చాయి లేదా ఆ విషయం వల్లే విడాకులు వచ్చాయి అంటూ ఎవరికి వారు ఒక జడ్జిమెంట్ కి వచ్చేసి వారి జీవితాల్లో నిప్పులు పోయడం చేస్తారు కానీ ఇకనైనా ఎవరి పని వారు చేసుకుంటే బాగుంటుంది దయచేసి ఎక్కడికో తీసుకెళ్లకుండా ఎవరి జీవితాన్ని వారికి ప్రశాంతంగా వదిలేయండి.ఎవరు విడాకులు తీసుకుంటే మనకు వచ్చే లాభమేంటి ఎవరు పెళ్లి చేసుకుంటే మనకొచ్చే గిఫ్ట్ ఏంటి అందుకే పక్క వాళ్ళ జీవితాల్లో కాస్త ఇంట్రెస్ట్ తగ్గించి మన జీవితాన్ని చక్కపరచుకుంటే మంచిది అని ఈ ఆర్టికల్స్ సారాంశం.