బిగ్ బాస్ ముద్దు వ్యవహారంపై ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన సల్మాన్ ఖాన్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్( Salman Khan ) వ్యాఖ్యతగా హిందీ బిగ్ బాస్( Hindhi Bigg Boss ) కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే.అయితే తాజాగా హిందీలో ఈ కార్యక్రమం ఓటీటీ రెండవ సీజన్ ప్రసారమవుతుంది.

 Salman Khan Apologized To The Audience,bigg Boss, Bollywood, Hadid, Akansha, Apo-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్ లో అయినటువంటి.

హ‌దీద్‌( Hadid ) ఆకాంక్షలు( Akanksha ) తాము బిగ్ బాస్ హౌస్ లో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి శృతిమించి ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు.

దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.ఈ క్రమంలోనే వీకెండ్ కంటెస్టెంట్లతో హోస్ట్ మాట్లాడుతూ వారు చేసిన తప్పులను బయటపెడుతూ ఉంటారు.

Telugu Akansha, Apologize, Bigg Boss, Bollywood, Hadid-Movie

ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ వీకెండ్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హౌస్ లో సదరు కంటెస్టెంట్లు చేసిన పనికి ఈయన ముందుగా ప్రేక్షకులకు క్షమాపణలు ( Apologies ) చెప్పారు.అనంత‌రం వారిద్ద‌రిపై మండిప‌డ్డాడు.ఇది ఫ్యామిలీతో క‌లిసి చూసే షోనా.? మ‌రోదైనా షో అని అనుకుంటున్నారా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు .అయితే మొదట్లో సదురు కంటెస్టెంట్లు సినిమా ఫీల్డ్ లో ఇవి సాధారణ అంటూ చెప్పుకొచ్చారు.ఈ మాటలకు సల్మాన్ స్పందిస్తూ మీరు ఇక్కడికి సినిమా చేయడానికి లేదా వెబ్ సిరీస్ చేయడానికి రాలేదు.

ఇదేమైనా స్క్రిప్ట్ నా అలా చేయమని మీకు ఎవరు రాసిచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telugu Akansha, Apologize, Bigg Boss, Bollywood, Hadid-Movie

ఈ విధంగా సల్మాన్ ఖాన్ వీరిపై మండిపడటంతో ఒక్కసారిగా సదరు కంటెస్టెంట్ లు క్షమాపణలు చెప్పారు.ఇలా మీరు వ్యవహరించడం కొందరికి నచ్చవచ్చు కానీ చాలామందికి నచ్చవని సల్మాన్ తెలిపారు.ఈ దేశం సాంప్ర‌దాయాల‌కు విలువ ఇస్తుంద‌న్న విష‌యాన్ని మ‌రిచిపోకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌రోసారి ఇలాంటివి హౌస్ లో పునరావృతం కాకూడదని ఇలాంటివి కనుక రిపీట్ అయితే తప్పకుండా వారిని డైరెక్ట్ ఎలిమినేట్ చేసేస్తాము అంటూ ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ అందరికీ కూడా సల్మాన్ తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube