జులై 1 నుంచి కీలక మార్పులు.. గ్యాస్ ధర దిగొస్తుందా..?

ప్రతి నెల ఒకటో తేదీ రాగానే.ఉద్యోగస్తులకు జీతాలు( Employees ) పడతాయి.

 Key Changes From July 1.. Will The Price Of Gas Come Down. Gas Agency, Cylinder-TeluguStop.com

అలాగే కొత్త నెలలో ఈఎంఐలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.ఒకటో తేదీ వచ్చిందంటేనే చాలామందికి భయం వేస్తూ ఉంటుంది.

అద్దె ఇళ్లల్లో ఉండేవారు అద్దె చెల్లించడం, ఇతర అప్పులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.అయితే ప్రతి నెల ఒకటో తేదీ రాగానే అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి.

ఈ సారి ఏప్రిల్ నెలలో అనేక మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి.మరో నాలుగు రోజుల్లో కొత్త నెల ప్రారంభం కాబోతుంది.

దీంతో వచ్చే నెలలో జరిగే మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Cylinder, Gas Agency, July St, Latest-Latest News - Telugu

ప్రతీ నెలా ఒకటో తేదీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్( LPG gas cylinder ) ధరలపై సమీక్ష జరుగుతుంది.దీంతో గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి.గ్యాస్ సిలిండర్ ధరలో హెచ్చుతగ్గులు సామాన్యులపై ప్రభావం చూపిస్తాయి.

దీంతో ఒకటో తేదీ రాగానే గ్యాస్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.గ్యాస్ ధర పెరిగితే సామాన్యులపై పెను భారం పడుతుంది.

అలాగే తగ్గితే ఊరట కలిగినట్లు చెప్పవచ్చు.ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆయిల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి.

కానీ గృహ అవసరాల కోసం ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించలేదు.దీంతో వచ్చే నెలలో ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది.

Telugu Cylinder, Gas Agency, July St, Latest-Latest News - Telugu

అలాగే క్రెడిట్ కార్డు( Credit Card ) విషయంలో జులై 1 నుంచి కొన్ని మార్పులు జరగనున్నాయి.విదేశాల్లో క్రెడిట్ కార్డు ఖర్చులపై టీసీఎస్ వసూలు చేయనున్నారు.ఖర్చు 7 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే 20 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.ఇక విద్యా,వైద్య ఖర్చులపై 5 శాతం టీసీఎస్, అలాగే విదేశాల్లో చదువు నిమిత్తం అప్పు తీసుకునే ట్యాక్స్ పేయర్లపై 7 లక్షల కంటే ఎక్కువ డబ్బు అయితే 0.5 శాతం టీసీఎస్ వసూలు చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube