Mithun Chakraborty : నాకు అది తక్కువని హీరోయిన్స్ నన్ను దూరం పెట్టారు: సీనియర్ స్టార్ హీరో

హీరో బెంగాలీ నటుడు మిథున్‌ చక్రవర్తి( Mithun Chakraborty ) గురించి మనందరికి తెలిసిందే.దాదాపు 40 ఏళ్ల క్రితం మిథున్‌ హీరోగా నటించిన డిస్కో డ్యాన్సర్‌ సినిమా లోని ఈ పాట అప్పటికీ, ఇప్పటికీ పాపులరే కానీ కెరీర్‌ తొలినాళ్లలో మిథున్ తో నటించడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదట.

 Mithun Chakraborty Reveals Heroines Refused Work Him-TeluguStop.com

కలర్‌ తక్కువ అని పెద్ద హీరోయిన్స్‌ అతడిని దూరం పెట్టేవారట.పుట్టుకతో వచ్చిన రంగును ఎలాగూ మార్చలేం కాబట్టి తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకోవాలనుకున్నాడట.

అలా పట్టుదలతో చివరకు అందరూ తన రంగు గురించి కాకుండా డ్యాన్స్‌ గురించి మాట్లాడుకునేలా చేశాడట మిథున్‌ చక్రవర్తి.

Telugu Bollywood, Disco, Skin, Zeenat Aman-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మిథున్ చక్రవర్తి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.కాగా ఇంటర్వ్యూలో భాగంగా మిథున్‌ చక్రవర్తి మాట్లాడుతూ.నన్ను హీరోగా చూశాక జనాలు నాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు.

నా కొడుకును కూడా హీరో చేసేయవచ్చు అనుకున్నారు.నేను సామాన్య ప్రజల హీరోగా మారాను.

కామన్‌ మ్యాన్‌కు సూపర్‌స్టార్‌ అవడం అనేది చాలా గొప్ప విషయం.నేను నా కాళ్లను కదిలిస్తూ డ్యాన్స్‌( Mithun Chakraborty Dance ) చేస్తే ఎవరూ నా రంగు గురించి పట్టించుకోరనుకున్నాను.

Telugu Bollywood, Disco, Skin, Zeenat Aman-Movie

కానీ చివరికి అదే నిజం అయ్యింది.నా డ్యాన్స్‌ వల్ల నా కలర్‌( Mithun Chakraborty Skin Color )ను మర్చిపోయారు.ఎందుకంటే నలుపు రంగులో ఉన్నందున ఎవరూ నన్ను హీరోగా అంగీకరించలేకపోయారు.ఆ సందర్భంలో నాకు చాలా బాధేసేది.చాలా సందర్భాలలో ఏడ్చేసాను అని తెలిపారు మిథున్ చక్రవర్తి.అలాగే నా కలర్ కారణంగా పెద్ద హీరోయిన్స్‌ నావైపు కన్నెత్తి చూసేవారు కాదు.

నాతో నటించడానికి ఇష్టపడేవారు కాదు.నన్ను అసలు వాళ్లు హీరోగానే చూడలేదు.

నాతో పని చేస్తే వారికి ఎటువంటి ఫేమ్‌ రాదని నన్ను పక్కనపెట్టేసేవాళ్లు.సరిగ్గా ఆ సమయంలో జీనత్‌ అమన్‌( Zeenat Aman ) వచ్చింది.

ఇతడు చాలా బాగున్నాడు.ఇతడితో నటించడానికేంటి సమస్య అని నా సరసన హీరోయిన్‌గా నటించింది.

ఇక అప్పటినుంచి నా కెరీర్‌ బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది అని తెలిపారు మిథున్‌ చక్రవర్తి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube