*దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 11 వ తేదీన సిరిసిల్లలో కవి సమ్మేళనం*

– సిరిసిల్ల పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో ఈ నెల 11 న ఉదయం 10.00 గంటలకు కవి సమ్మేళనం.

 Kavi Sammelan At Sirisilla On 11th As Part Of Dasabdi Utsavam Details,district N-TeluguStop.com

– “తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రగతి” ప్రతిబింబించే అంశంతో కూడిన ఉర్దూ,తెలుగు కవితలకు ఆహ్వానం.

– కనిష్టంగా 20 పంక్తులు, గరిష్ఠంగా 26 పంక్తులకు మించకుండా కవితలు పంపాలి.

– ఈ నెల 7 వ తేదీ సాయంత్రం 04.00 గంటలలోగా వాట్సాప్‌ నంబర్ 9908922301 కు కవితలు పంపాలి.

– జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం.

రాజన్న సిరిసిల్ల జిల్లా

: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సాహిత్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోఈ నెల 11 వ తేదీన కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి దశరథం తెలిపారు.ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.సిరిసిల్ల పట్టణంలోనీ జిల్లా గ్రంథాలయంలో నిర్వహించే ఈ కవి సమ్మేళనం ఈ నెల 11 వ తేదీన ఉదయం 10.00 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు.కవి సమ్మేళనంలో పాల్గొనే కవులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు.

కవులు తమ తెలుగు, ఉర్దూ కవితలు కనిష్టంగా 20 పంక్తులు , గరిష్ఠంగా 26 పంక్తులు మించకుండా ఉండాలన్నారు.కవితాంశం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించే సాహిత్య దినోత్సవం సందర్బంగా .” తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రగతి ” పూరితమైన కవితాంశంతో ఉండాలన్నారు.పంపించే కవితలు ఇంతకుముందు దినపత్రికలో, వారపత్రికలో, పుస్తకాలలో ప్రచురించబడి ఉండకూడదన్నారు.ఆసక్తి గల కవులు తమ కవితలను ఈ నెల 7 వ తేదీ సాయంత్రం 4.00 గంటల్లోగా డిపిఆర్ఓ కార్యాలయం టైపిస్ట్ కె.కవిత వాట్సాప్‌ నంబర్‌ 9908922301 కు తమ పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ తో సహా పంపాలని కోరారు.
కవులు తమ కవితలను పంపించేటప్పుడు వాట్సప్ లో టైప్ చేసి పంపాలి లేదా రాత స్పష్టంగా అర్ధం అయ్యేలా ఉండాలన్నారు.

కవితల ఎంపికలో నిర్వహకులదే తుది నిర్ణయమని అన్నారు.ఈ విషయంలో ఏలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావుండదన్నారు.ఎంపిక కాబడిన కవులకు వాట్సాప్ ద్వారా గాని ఫోన్ ద్వారా గాని సమాచారం తెలియజేయబడుతుందనీ తెలిపారు.నిర్వహకులు ఎంపిక చేసిన కవులకు మాత్రమే తమ కవితలను చదివే అవకాశం ఉంటుందని జిల్లా పౌర సంబంధాల అధికారి దశరథం పేర్కొన్నారు.

కవి సమ్మేళనంలో కవితలు చదివేందుకు ఎంపిక కాబడిన కవులు సిరిసిల్ల పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో నిర్వహించే కవి సమ్మేళనంకు నిర్దేశిత సమయాకంటే అరగంట ముందు రావాలని డిపిఆర్ఓ విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube