తెలంగాణ బీజేపీ అధికారం కోసం సరికొత్త వ్యూహరచనతో ముందుకు సాగుతోంది.ఏపీలో జగన్ ( CM Jagan Mohan Reddy ) ఫాలో అవుతున్న వ్యూహాన్నే తెలంగాణలో తాము కూడా ఫాలో అయ్యే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు కమలనాథులు.
ఏపీలో సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ” గడప గడపకు మన ప్రభుత్వం “( Gadapa Gadapaku Mana Prabhutvam ) అనే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ ఎమ్మేల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు.
అందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించడం, అలాగే ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేయడం వంటివి చేయాలి.ఈ కార్యక్రమాన్ని సిఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫాలో అవుతున్నారు.
అయితే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలపై ప్రజా తిరుగుబాటు స్పష్టంగా కనిపిస్తోంది.అభివృద్దిపై ఎమ్మెల్యేలను ప్రజలు డైరెక్ట్ గా నిలదిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
దీంతో సమాధానం చెప్పలేని ఎమ్మేల్యేలు మొఖం చాటేసుకుంటున్నారు.ఇక ప్రజాగ్రహం కారణంగా మెజారిటీ ఎమ్మేల్యేలు గడపగడపకు తిరగలేని పరిస్థితి.
అయితే ఇదే వ్యూహాన్ని ఇప్పుడు బిజెపి ( BJP ) ఫాలో అవ్వాలని చూస్తోంది.వచ్చే ఎన్నికలతో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది బీజేపీ.
ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన నేతలను ప్రజలకు దగ్గర చేయాలంటే ఇంటింటికి ప్రచారం చేయడమే ముందున్న మార్గం.అందుకే కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజలకు వివరించి రాష్ట్రంలో పార్టీకి మైలేజ్ తీసుకు రావాలని తెలంగాణ కమలనాథులు భావిస్తున్నారు.మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తామని, అందుకోసం 119 నియోజిక వర్గాలలో ప్రతి గడపకు తిరుగుతామని, బహిరంగ సభలు నివహిస్తామని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్( Bandi Sanjay ) చెప్పుకొచ్చారు.
అయితే కేంద్రం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్ర బీజేపీకి ఎంతవరకు ప్లెస్ అవుతాయంటే చెప్పడం కష్టమే.తాము అధికారంలోకి వస్తే ఏం చేయాలో చెప్పకుండా కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తే ప్రజలు ఎంతవరకు విశ్వశిస్తారనేది కూడా ప్రశ్నార్థకమే.కాగా ఏపీలో గడప గడపకు తిరిగిన వైసీపీకి ప్రజల నుంచి వ్యతిరేకతే తప్పా.
ఆ పార్టీకి ఒరిగిందేమీ లేదు.ఇప్పుడు అదే వ్యూహాన్ని తెలంగాణలో బీజేపీ ఫాలో కాబోతుంది.
మరి కమలం పార్టీకి ఇది వర్కౌట్ అవుతుందో చూడాలి.