అన్ని అవయవాలు సరిగ్గా వున్నవారే ఏమి చేతకాని వాళ్ళలాగా సమయాన్ని వృధా చేస్తుంటే కొంతమంది అవయవాలు సరిగ్గా లేకున్నా, విధికే సవాలు విసురుతున్నారు.తాజాగా కంటి చూపు లేని ఓ అథ్లెట్ మౌంట్ ఎవరెస్టు( Mount Everest ) ఎక్కి జనాలను విస్మయానికి గురిచేసేలా చేసాడు.
అతగాడు బేసిగ్గా అథ్లెట్ అయినప్పటికీ మౌంటెనేరింగ్ అంటే చాలా ఇష్టం.పర్వతాలను ఎక్కాలన్న జోష్ అతనిలో చిన్నప్పటినుండి ఉంది.
దాంతోనే ప్రస్తుతం ఈ ఫీట్ సాధించి ప్రపంచానికి పరిచయం అయ్యాడు.
అతడే మెక్సికోకు చెందిన రఫా జేమి( Rafa Jaime ).గుడ్డివాడిననే విషయాన్ని పక్కనబెట్టి చాలా ఈజీగా మౌంట్ ఎవరెస్టును ఎక్కేశాడు.దాంతో ఎవరెస్టును అధిరోహించిన తొలి గుడ్డి వ్యక్తిగా అతను రికార్డు క్రియేట్ చేశాడు.
సెవన్ సమ్మిట్ ట్రెక్స్ ఎక్స్‌పెడీషన్ డైరెక్టర్ అయినటువంటి ‘చాంగ్ దవా షెర్పా( Chhang Dawa Sherpa )’ దీనిపై స్పందిస్తూ… తన స్నేహితుడు జెస్మాన్ తమాంగ్‌తో కలిసి రఫా.ఎవరెస్టును ఎక్కినట్లు తెలిపారు.
సెవన్ సమ్మిట్ ట్రెక్స్‌కు చెందిన గైడ్స్ కూడా రఫా జేమితో కలిసి ఎవరెస్టు ఎక్కిన విషయం విదితమే.స్నేహితుడు ఒమర్ అల్వరేజ్‌తో కలిసి రఫా మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు.రఫాకు చిన్నప్పటినుండి కంటి చూపు లేదు.అయినా పర్వతారోహణలో అతను మంచి పట్టుదలను ప్రదర్శించినట్లు చాంగ్ దవా ఈ సందర్భంగా కొనియాడారు.ఒమర్, రఫాలు తమ స్నేహంలోని శక్తిని చాటారన్నారు.కోరిక, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే.
సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండదని రఫా నిరూపించారని తెలిపారు.ప్రస్తుతం రఫా హీరోగా మారిపోయారు.
రేపటి తరానికి అయన ఓ సూపర్ హీరో అని ఆకాశానికెత్తేశారు.