'టైగర్ నాగేశ్వరరావు' కోసం సీతారామం హీరో.. మరి రామ్ ప్లస్ అయ్యేనా?

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘‘టైగర్ నాగేశ్వరరావు’‘ ( Tiger Nageswara Rao ).ఈ సినిమాతో రవితేజ మొదటిసారి పాన్ ఇండియా బాట పట్టారు.

 Dulquer Salmaan For Tiger Nageswara Rao, Tiger Nageswara Rao First Look, Tiger N-TeluguStop.com

ప్రస్తుతం రవితేజ లైనప్ లో ఉన్న ఒకే ఒక్క సినిమా ఇదే కావడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ సినిమాలను స్టార్ట్ చేయాలని రవితేజ ప్లాన్ లో ఉన్నారు.

టైగర్ నాగేశ్వరరావు సినిమాను డైరెక్టర్ వంశీ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను నిర్మాతలు నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఇప్పుడు నిర్మాతలు ప్లానింగ్ చేస్తున్నారు.

ఈ ఫస్ట్ లుక్ ను ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కో స్టార్ తో ప్లాన్ చేస్తున్నారు.దీని వల్ల ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంటుంది అని ఇలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఇక నిన్ననే ఈ సినిమా కన్నడ ఫస్ట్ లుక్ ను స్టార్ హీరో శివ రాజ్ కుమార్ లాంచ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.ఇక ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చారు.

Telugu Dulquer Salmaan, Dulquersalmaan, Ravi Teja, Tigernageswara, Vamsee Krishn

ఈ సినిమా మలయాళంకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు.అక్కడి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) తో వాయిస్ ఓవర్ తో పరిచయం చేస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.సీతారామం సినిమాలో రామ్ గా వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ యంగ్ హీరో టైగర్ కు తన వంతు ప్రమోషన్స్ చేస్తున్నాడు.ఇలా ఒక్కో భాషలో ఒక్కో స్టార్ తో సాలిడ్ ప్లానింగ్స్ చేస్తున్నారు.

Telugu Dulquer Salmaan, Dulquersalmaan, Ravi Teja, Tigernageswara, Vamsee Krishn

ఈ సినిమా ఫస్ట్ లుక్ మాస్ మహారాజ రవితేజ ( Ravi Teja )ఫ్యాన్స్ అంతా గర్వంగా చెప్పుకునే లెవల్లో ఈ అప్డేట్ ఉంటుందని. ఫస్ట్ లుక్ తోనే మాస్ మహారాజ మాస్ సంభవం గ్యారెంటీ అంటూ అతి త్వరలోనే ఈ లుక్ ను రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ మాట ఇచ్చారు.దీంతో ఫ్యాన్స్ ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube