హోంశాఖ సమీక్షలో గురువారం సీఎం జగన్( CM YS Jagan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.జీవో నెంబర్ వన్ పై పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
జీవో నెంబర్ వన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.రోడ్లపై మీటింగుల వల్ల ఇకపై మనుషులు చనిపోయే పరిస్థితులు ఉండకూడదని హెచ్చరించారు.
తక్కువ మందిని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.రెండు మీటింగ్స్ లలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
ఇందుకు ఉదాహరణగా కందుకూరు, గుంటూరు ఘటనలను సీఎం జగన్ ప్రస్తావించటం జరిగింది.
ప్రచారం కోసం రోడ్లు కిక్కిరిసేలా చేస్తున్నారు.
దీంతో అమాయకులు బలైపోతున్నారు.కాబట్టి జీవో నెంబర్ వన్ సమర్థవంతంగా అమలు చేయాలని హోంశాఖ రివ్యూలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
అదేవిధంగా డ్రగ్స్, సోషల్ మీడియాలో వేధింపుల పైన( Social Media Harassment ) దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.వేధింపుల కంట్రోల్ కి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇదే సమీక్ష సమావేశంలో దిశ యాప్( Disha App ) మీద మరోసారి డ్రైవ్ నిర్వహించి ప్రతి ఇంట్లో కూడా ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారా.? లేదా ? అన్నదానిపై పరిశీలన చేయాలని సూచించారు.దిశా యాప్ ప్రయోజనాలను అర్థమయ్యే రీతిలో కరపత్రం రూపంలో ప్రతి ఇంటికి అందించాలని సీఎం జగన్ పేర్కొన్నారు.