మహారాష్ట్రలో గత ఏడాది కాలంగా తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది.మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేనలో చీలిక రావడం, అధికారం చేతులు మారడం, అటు నుంచి ఇటు.
ఇటు నుంచి అటు అంటూ అధిక సంఖ్యలో మారుతుండడంతో ఆ రాష్ట్ర రాజకీయాలపై అందరి దృష్టి పడింది.అసలు మహారాష్ట్రలో ఏం జరుగుతోందనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరుగుతూ వస్తోంది.
మొదట శివసేన తరుపున సిఎం గా ఉన్న ఉద్దవ్ థాక్రే ను పక్కా ప్రణాళికతో బీజేపీతో చేతులు కలిపి థాక్రే ( Uddhav Thackeray )ను గద్దె దించారు అదే పార్టీకి చెందిన ఏక్ నాథ్ షిండే( Eknath Shinde )ఫలితంగా ఒకటిగా ఉన్న శివసేన థాక్రే శివసేన వర్గం, షిండే శివసేన వర్గం అని రెండు వర్గాలుగా డివైడ్ అయింది.
మరోవైపు శివసేన పార్టీలో ఏర్పడిన చీలికను అనుకూలంగా మలుచుకునేందుకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే షిండే శివసేన వర్గానికి బీజేపీ నుంచి గట్టి మద్దతు ఉండడంతో ఇతర పార్టీలను ముప్పు వాటిల్లుతోంది.శరత్ పవార్ నేతృత్వంలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కూడా చీలిక తీసుకోచ్చేందుకు బీజేపీ మరియు షిండే వర్గం ప్రయత్నిస్తోందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్సీపీ లోని కీలక నేత ప్రదీప్ పవార్ ద్వారా ” షిండే వ్యూహాన్నిఅమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా షిండే శివసేన వర్గానికి చెందిన మంత్రి ఉదయ్ ( Uday Samant )చేసిన వ్యాఖ్యాలే ఇందుకు నిదర్శనం.తమతో ఎన్సీపీలోని 20 మంది ఎమ్మేల్యేలు టచ్ లో ఉన్నారని వాళ్ళు ఏ క్షణంలోనైనా శివసేన ( షిండే వర్గం ) లో చేరతారని హాట్ కామెంట్స్ చేశారు.కాకుండా శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం నుంచి కూడా 13 మంది ఎమ్మేల్యేలు షిండే తో చేతులు కలిపేందుకు సిద్దంగా ఉన్నారట.
దీంతో మళ్ళీ మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.
అయితే షిండే కారణంగా ఇప్పటికే అధికారం కోల్పోయిన ఉద్దవ్ థాక్రే ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు మరింత జాగ్రత వచించే అవకాశం ఉంది.అటు ఎన్సీపీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కోవడం ద్వారా ఆ పార్టీ బలహీన పడితే శివసేన ( షిండే వర్గం ) కు తిరుగుండదనే వ్యూహంలో ఏక్ నాథ్ షిండే ఉన్నట్లు తెలుస్తోంది.మొత్తానికి షిండే వేసే ప్రతి రాజకీయ వ్యూహం వెనుక బీజేపీ తంత్రం ఉందనేది మహారాష్ట్ర పోలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న మాట.