ముస్లిం సోదర సోదరీమణులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంజాన్ తోఫా పంపిణీ

వేములవాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఇచ్చే రంజాన్ తోఫా ను కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణ ముస్లిం సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే రమేష్ బాబు తరపున మున్సిపల్ పాలకవర్గం తరఫున ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

 Distribution Of Ramzan Tofa On Behalf Of Telangana State Government To Muslim Br-TeluguStop.com

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి గా కేసీఆర్ అయిన తర్వాత ప్రతి ఒక్క మతాన్ని వారి పండుగలను గుర్తిస్తూ గౌరవిస్తూ బతుకమ్మ పండుగకు

మహిళలకు చీరలను,క్రిస్మస్ కు క్రైస్తవ సోదరులకు బట్టలను, రంజాన్ కు ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫా ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అని కులాలను మతాలను సమాన భావంతో చూస్తు మతసామరస్యాన్ని కోరుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎంతోమంది పేద ముస్లిం విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించాలని రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ గురుకులాలను ఏర్పాటుచేసి విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే మైనార్టీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ను అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు.

Telugu Rajannasircilla, Sudheer, Telugudistricts-Telugu Districts

ఒక పేదింటి ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఇంటి తండ్రికి భారం కాకూడదు అనే ఉద్దేశంతో మేనమామ కట్నంగా షాదీ ముబారక్ పథకం ద్వారా ఒక లక్ష 116 రూపాయలు ఇచ్చి వారికి ఆర్థికంగా చేయూతనందించిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మైనార్టీల ఆర్థిక ఎదుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీలకు రుణాలు అందిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపగడపకు ఏదో రూపంలో సంక్షేమ ఫలాలు పథకాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనకు నిదర్శనమని వారన్నారు.

ఈ సందర్భంగా మైనార్టీ సోదర సోదరీమణుల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు, కౌన్సిలర్లు బింగి మహేష్,కొండ పావని నర్సయ్య ,మారం కుమార్ ,సిరిగిరి చందు ,నిమ్మశెట్టి విజయ్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఫీర్ మహమ్మద్ ,కో ఆప్షన్ సభ్యులు షేక్ సర్వర్ అలీ , నాయకులు కొండ కనకయ్య ,మైనార్టీ సంఘం నాయకులు, ముస్లిం సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube