మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ కీలక అంశాలను పొందుపరిచింది.
ఉదయ్ కుమార్, శివశంకర్ లతో పాటు వైఎస్ అవినాశ్ రెడ్డి కలిసి ఆధారాలను తారుమారు చేశారని సీబీఐ పేర్కొంది.హత్య జరిగిన తరువాత ఉదయ్ కుమార్ రెడ్డి అవినాశ్ ఇంటికి వెళ్లారని, గూగుల్ టేక్ ఔట్ లొకేషన్ లో కూడా ఉదయ్ కుమార్ రెడ్డి అనివాశ్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు తేలిందని రిమాండ్ రిపోర్టులో తెలిపింది.
ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి ప్రకాశ్ రెడ్డితో వివేకా మృతదేహానికి కుట్లు వేయించారని పేర్కొంది.అవినాశ్ రెడ్డికి ఉదయ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితుడని వెల్లడించింది.
వివేకా మృతి చెందాడని తెలియగానే అవినాశ్, ఉదయ్ కుమార్, శివశంకర్ ఘటనా స్థలానికి వెళ్లారని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది.