సూపర్ స్టార్ మహేష్ బాబు తన తోటి హీరోలను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు.నేను సూపర్ స్టార్ ని.
వేరే హీరోలను పొగడడం ఏంటి అని ఎప్పుడు మహేష్ ఆలోచించడు.తనకు నచ్చితే అది చిన్న సినిమా అయిన సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు అందించడం ఈయనకు బాగా అలవాటు.
ఇక తన కుటుంబం నుండి వచ్చిన హీరోకు ఎంత సపోర్ట్ అందిస్తాడో అర్ధం చేసుకోవచ్చు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం నుండి టాలీవుడ్ కి పరిచయం అయ్యిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో గల్లా అశోక్.ఈ హీరో మొదటి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టే సమయంలోనే మహేష్ బాబు (Mahesh Babu) ఇతడిని ప్రమోట్ చేస్తూ తన ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు.‘హీరో’ సినిమాతో అడుగుపెట్టిన ఈయన మంచి హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఇప్పుడు తన రెండవ సినిమాతో ఈ హీరో మరోసారి అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు రాబోతున్నాడు.అయితే మొదటి సినిమాలో లవర్ బాయ్ లా కనిపించిన అశోక్ (Ashok Galla) ఇప్పుడు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాలిడ్ మాస్ సినిమా నుండి ఈ రోజు సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టు కుంటుంది.మరి మహేష్ చేతుల మీదుగా రిలీజ్ కావడంతో నిముషాల్లోనే నెట్టింట వైరల్ అయ్యింది.ఇందులో అశోక్ గల్లా సరికొత్త మేకోవర్ తో మాస్ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయినట్టు కనిపిస్తుంది.
భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీ లలితాంబిక ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తుండగా ఈ సినిమా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Glimpse Video) కథ అందించడం విశేషం.