వరల్డ్ రికార్డ్ సృష్టించిన 70 ఏళ్ల బాడీ బిల్డర్!

నేటి దైనందిత జీవితంలో నిండా మూడు పదుల వయసు రాకుండానే మన మగ మహారాజులు పొట్టలు పెంచేస్తున్నారు.కనిపించి కనిపించకుండా ఉంటున్న ఈ పొట్టలు మనకే కాకుండా చూసేవారికి కూడా కాస్త ఎబ్బెట్టుగా ఉంటాయి.

 A 70-year-old Body Builder Who Created A World Record, 70 Years, Body Builder, V-TeluguStop.com

అమ్మాయిలైతే ఇక లోలోపల నవ్వుకుంటూ వుంటారు.దాంతో కొంతమంది పొట్ట వచ్చిన తర్వాత జాగ్రత్త పడి వర్కౌట్ లు మొదలు పెడుతూ వుంటారు.

అలాంటి వారికి “ఆండ్రియాస్ కాలింగ్” ఆదర్శం అనడంలో అతిశయోక్తి లేదు.ఇంతకీ ఎవరీ ఆండ్రియాస్ కాలింగ్ అంటే… ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బాడీ బిల్డర్ అని చెప్పుకోవచ్చు.

అవును, ఆండ్రియాస్ చిన్న వయసులోనే బాడీ బిల్డింగ్ వైపు మళ్లాడు.అంతేనా ఆయన ఏడు పదుల వయసు వచ్చినా కూడా బాడీ బిల్డింగ్ విషయంలో వెనకడుగు వేయలేదు.దాంతో నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ వున్నాడు.ఈ వయసులో మన నిన్నటి తరం చూసుకుంటే బాగా పండు ముసలైపోయి ఏవేవో జబ్బులతో బాధపడుతూ వుంటారు.

కొందరు కనీసం గట్టిగా నిలబడేందుకు కూడా కష్టపడుతూ ఉంటారు.అలాంటిది ఆండ్రియాస్ కాలింగ్ తన బాడీ బిల్డింగ్ తో సర్ ప్రైజ్ చేస్తున్నాడు.

స్వీడన్ కు చెందిన ఆండ్రియాస్ 11 ఏళ్ల వయసులోనే రెజ్లింగ్ ను తన కెరీర్ గా ఎంపిక చేసుకున్నాడు.17 ఏళ్ల వయసు లో జపాన్ లో జూడో పోటీల్లో పోటీ చేసాడు.ఆ సమయంలో జపాన్ అంటే అభిమానం ఏర్పడి అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు.అనుకున్నదే తడవుగా స్థానిక భాష నేర్చుకోవడంతో పాటు అక్కడ ఒక బార్ లో ఉద్యోగంలో కూడా జాయిన్ అయిపోయాడు.

ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయంలో సాధన చేసి రెజ్లింగ్ పై పట్టు సాధించాడు.రెజ్లింగ్ కంటే కూడా బాడీ బిల్డింగ్ కు ప్రాముఖ్యత ఎక్కువ ఉందని గుర్తించిన ఆండ్రియాస్ పూర్తి స్థాయి బాడీ బిల్డర్ గా మారాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube