శాస్త్రవేత్తలు ఎట్టకేలకు సాధించారు... రెండు మగ ఎలుకలకు సంతానం పుట్టించారు, మనుషులదే తరువాయి?

అవును, ఆశ్చర్యపోకండి.మీరు విన్నది నిజమే.

 Japan Scientists Creates Mice With Two Fathers Details, Scientists,succeeded,two-TeluguStop.com

దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని చెప్పుకోవచ్చు.రెండు మగ ఎలుకలకు తాజాగా సంతానం పుట్టించారు.

జపాన్​ శాస్త్రవేత్తలు పురుష జీవుల చర్మ కణాలలో నుంచి.అండాలను సేకరించి సంతానాన్ని ఉత్పత్తి చేశారు.

కాగా ఇది ఈ ప్రపంచంలోనే అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు.జపాన్‌లోని క్యుషు, ఒసాకా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల బృందం ఈ ఘనతను సాధించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మానవులలో కొత్త సంతానోత్పత్తి చికిత్సలకు ఇది దోహదపడే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

లండన్​లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్లో బుధవారం ఓ సమ్మిట్ జరిగింది.ఈ సందర్భంగా ఈ విషయం చెప్పుకొచ్చారు.గతంలో కూడా శాస్త్రవేత్తలు సాంకేతికంగా ఇద్దరు బయెలాజికల్​గా ఫాదర్స్ నుంచి ఎలుకను సృష్టించిన విషయం విన్నాం.

కానీ రెండు మగ ఎలుకల కణాల నుంచి అండాలను సృష్టించడం ఇదే మొదటి సారి కావడం విశేషం.ఈ ప్రక్రియ ద్వారా ఇండుసెడ్​ ప్లూరిపోటెంట్ స్టెమ్ కణాలను సృష్టించడానికి మగ చర్మ కణాలను స్టెమ్ సెల్ లాంటి స్థితికి రీప్రోగ్రామ్ చేసింది సదరు పరిశోధన బృందం.

తరువాత వై క్రోమోజోమ్​ను డిలీట్​ చేసింది.ఆ తరువాత ఎక్స్​ క్రోమోజోమ్​తో రీప్లేస్​ చేసింది.

ఈ క్రమంలో వారు అనుకున్నది ఆఖరికి సాధించారు.అంటే పరిశోధనలో మగ ఎలుక చర్మ కణం నుంచి ఒక మూలకణాన్ని సృష్టించినట్టుగా తెలుస్తోంది.ఈ ప్రాసెస్ సక్సెస్ అయింది కనుక ఇదే టెక్నిక్​ను మానవులపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త “హయాషి” ఈ సందర్భంగా తెలిపారు.రాబోయే పది సంవత్సరాలలో ఇది సాధ్యం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అవి పునరుత్పత్తికి ఉపయోగపడతాయో లేదా అన్నది మాత్రం తనకు ఇంకా తెలియదని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube