ఇటీవలే కాలంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకునేవారు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.టెక్నాలజీ అనేది వ్యవసాయ రంగంలో కూడా అనేక మార్పులను తీసుకువచ్చింది.
వ్యవసాయ రంగంలో వచ్చిన కొత్త మార్పులతో పంటలను సాగు చేసి సగానికి పైగా పెట్టుబడి ఆదా కావడంతో పాటు అధిక దిగుబడి సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు రైతులు.
ప్రధానమైన వాణిజ్య పంటలలో వెల్లుల్లి కూడా ఒకటి.
వెల్లుల్లి ను సుగంధ ద్రవ్యంగా, ఔషధంగా వినియోగిస్తున్నందుకు మార్కెట్లో సంవత్సరం పొడుగునా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.కేవలం 6 నెలల్లోనే లక్షల్లో ఆదాయం పొందే పంటలలో వెల్లుల్లి పంట ఒకటి.
వెల్లుల్లి పంటను వానాకాలంలో పండిస్తే ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించలేము.వెల్లుల్లికి అక్టోబర్, నవంబర్ నెలలో చాలా అనుకూలంగా ఉంటాయి.
వెల్లుల్లి మొగ్గల ద్వారా వెల్లుల్లి పంటను పండిస్తారు.రియావాన్ రకం వెల్లుల్లి కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది.
కేవలం ఒక గడ్డలో 6 నుండి 10 వరకు మొగ్గలు ఉండి ఒక్కొక్కటి దాదాపు 100 గ్రాముల వరకు పెరుగుతాయి.
ఇక మార్కెట్లో వెల్లుల్లి లో చాలా రకాలు ఉన్నాయి.ఇంతకుముందు వెల్లుల్లి పండించిన రైతుల సలహా, లేదంటే అధికారుల సలహాతో మేలురకం సాగు చేస్తే దిగుబడి ఆశించిన స్థాయిలో ఉంటుంది.కేవలం నాలుగు నెలల లోనే పంట చేతికి వస్తుంది.
ఇక ఎకరాకు దాదాపు 40 వేల వరకు పెట్టుబడి అవసరం.
ఒక ఎకరం పొలంలో దాదాపు 50 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.ప్రస్తుతం మార్కెట్లో పదివేల నుండి 20వేల వరకు వెల్లుల్లి ధర పలుకుతుంది.అంటే ఒక ఎకరం పొలంలో రియావాన్ అటవీరకం వెల్లుల్లి సాగు చేయడం ద్వారా నాలుగు నెలల లోనే ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మంచి ఆదాయం పొందవచ్చు.
లేదా ప్రాసెస్ చేసి వెల్లుల్లిని పేస్ట్, పొడి రూపంలో నేరుగా మార్కెట్లో విక్రయించినట్లయితే ఆశించని స్థాయిలో లాభాలు పొందవచ్చు.