ఛలో సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు డైరెక్టర్ వెంకీ కుడుముల.ఈయన చేసిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాలో నాగ శౌర్య హీరో గా చేసారు.ఈ సినిమాతోనే రేష్మిక తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది…ఈ సినిమా తర్వాత వెంకీ కుడుములు నితిన్ ని హీరోగా పెట్టి బీష్మ సినిమా తీశారు ఈ సినిమా కూడా బాక్సఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా వచ్చి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా వెంకీ ఇంకో సినిమా మొదలు పెట్టలేదు.

దానికి కారణం వెంకీ చెప్పిన ఒక స్టోరీ చిరంజీవి గారికి బాగా నచ్చడం తో చిరంజీవి వెంకీ తో సినిమా చేద్దాం అని చెప్పాడట దాంతో చాలా రోజుల నుంచి వెంకీ చిరంజీవి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు…కానీ ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి వెంకీ సినిమా ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే పొజిషన్ లో కనిపించడం లేదు ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు కాబట్టి వెంకీ తో సినిమా చేసే అవకాశం తక్కువనే చెప్పాలి…

ఇక ఇది ఇలా ఉంటె వెంకీ ఈ మద్యే నితిన్ కి ఒక కథ చెప్పాడట అది నితిన్ కి బాగా నచ్చిందట దాంతో వెంకీ నితిన్ తో ఆ సినిమా చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.ఆల్రెడీ వీళ్ల కాంబో లో భీష్మ సినిమా హిట్ ఉంది.కాబట్టి ఈ కాంబో మీద ఇప్పటికే మార్కెట్ లో మంచి అంచనాలే ఉన్నాయి.
అయితే ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు ఈ సినిమా పూర్తి అయిన తర్వాత వెంకీ కుడుముల సినిమా ఉంటుందని తెలుస్తుంది…
.







