సినీ పరిశ్రమలో తరాలకు భాషతో పని లేదు.ఏ భాషలో అయినా నటించే స్వాతంత్యం అందరికి ఉంది.
అయితే గతంలో మన సౌత్ ఇండస్ట్రీని మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా చీప్ గా చూసేది.కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో సౌత్ ఇండస్ట్రీ ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీ చాలా ఎదిగింది.
స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు ప్రెజెంట్ అందరు కూడా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ కూడా ఇక్కడ సినిమాల్లో నటించడానికి ఆసక్తిగా ఉన్నారు.
ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసారు.మరి ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన బాలీవుడ్ నటుల జాబితా పరిశీలిస్తే.
మనోజ్ బాజిపేయి చాలా తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు.అలాగే జాకీ ష్రాఫ్ కూడా ప్రాంతీయ భాషల్లోకి అడుగు పెట్టి ఇక్కడ కూడా మంచి మంచి సినిమాలలో విలన్ రోల్స్ లో నటించాడు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు.ఈయన గాడ్ ఫాదర్ సినిమాతో టాలీవుడ్ లో అతిథి పాత్రలో మెప్పించాడు.ఇంకా అమితాబ్ బచ్చన్, సునీల్ శెట్టి, అజయ్ దేవగన్ లు కూడా తెలుగు లోకి అడుగు పెట్టి ప్రేక్షకులను అలరించారు.బాబీ డియోల్, సైఫ్ అలీ ఖాన్ వంటి వారు ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాల ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు.
ఇలా ప్రెజెంట్ తెలుగు మార్కెట్ పాన్ వరల్డ్ వైడ్ గా పెరగడంతో బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ఇక్కడ కీ రోల్స్ లో నటించడానికి సిద్ధం అవుతున్నారు.అంతేకాదు హీరోలు సైతం తమ ప్రతీ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.ఎప్పుడు లేని విధంగా ఇక్కడికి వచ్చి మరీ ప్రమోషన్స్ చేస్తూ తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.మొత్తానికి రాజమౌళి, సుకుమార్ లాంటి డైరెక్టర్ల వల్ల మన తెలుగు ఇండస్ట్రీ మరో స్థాయికి చేరుకుంది అనే చెప్పాలి.