ఈ సంవత్సరం ఫాల్గుణ మాసం లోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున మహా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.ఈ సంవత్సరం ఫిబ్రవరి 18 మహా శివరాత్రి వేడుకలు భక్తులు ఎంతో ఘనంగా, వైభవంగా జరపనున్నారు.
పురాణాల ప్రకారం శని మహా శివుడి అంతిమ భక్తుడిగా వెల్లడించారు.అందుకే మహా శివరాత్రి రోజున శివలింగానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను సమర్పిస్తే శని దేవుడి చెడు ప్రభావం దూరం అయిపోతుంది.
ప్రస్తుతం శని ధనస్సు, మకరం, కుంభ రాశులపై సంచరిస్తున్నారు.అందుకే ఈ రాశుల వారు శివరాత్రి రోజున కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం మంచిది.మహాశివరాత్రి రోజున శివలింగానికి గంగాజలాన్ని సమర్పించడం వల్ల శని చెడు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.ఇందుకోసం ఒక రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో కొద్దిగా గంగాజలం పోసి శివలింగానికి సమర్పించాలి.

అంతే కాకుండా శివుడి మెడలో వాసుకి అనే పాము ఉంటుంది.ఆ పాముకి పాలు అంటే ఎంతో ఇష్టం.కాబట్టి మహాశివరాత్రి రోజున శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి పాముకి పాలను కూడా సమర్పించడం మంచిది.శని దేవుడు ప్రభావం వల్ల మీకు ఎన్నో ఇబ్బందులు ఎదురయితే మహా శివరాత్రి రోజున శివలింగానికి పెరుగును సమర్పించాలి.
ఇలా చేయడం వల్ల మీ సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి.

ఇంకా చెప్పాలంటే శని ఆగ్రహం వల్ల వారి జీవితం కష్టనష్టాలతో నిండిపోయి, ఆనందం కరువైపోతే అలాంటి వారు మహా శివరాత్రి రోజున శివలింగానికి దేశీ నెయ్యిని సమర్పించడం వల్ల ఇవన్నీ దూరమవుతాయి.శని ప్రభావాన్ని నివారించడానికి మహాశివరాత్రి రోజు శివలింగానికి తేనెను సమర్పిస్తే అంతా మంచే జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.