సెలబ్రిటీ జంట ఆర్య, సయేషా సైగల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు కోలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ జంట సుపరిచితమే.
కాగా ఈ జంట గజినీకాంత్ అనే సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు కొంతకాలం పాటు రిలేషన్షిప్ ను కొనసాగించారు.
ఆ తర్వాత 2018 మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.కాగా 2021లో సయేషా ఒక పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
అయితే పాప పుట్టినప్పటినుంచి వారి కూతురికి సంబంధించిన ఫోటోలు లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
కానీ ఇటీవల ఆర్య బర్త్డే పార్టీలో సందర్భంగా వారు వారి గారాల పట్టి కీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.ఆ పాపకు అరియానా అనే పేరు పెట్టినట్టు తెలుస్తోంది.ఇటీవలే ఈ దంపతుల ముద్దుల కూతురు అరియానా మొదటి బర్త్డే వేడుకను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.
ఇది ఇలా ఉంటే ఈ జంట తరచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇకపోతే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఈ దంపతులు అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
ఢిల్లీలో చలి విపరీతంగా ఉండడంతో ఆ చలిలో తన భర్త వెచ్చని కౌగిలిలో ఎంతో హాయిగా ఉంటుంది అంటుంది సయేషా.
చలిలో తన భర్తను ప్రేమగా హత్తుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
క్యూట్ కపుల్ సూపర్ జోడి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు చలిలో భర్త కౌగిలికి మించిన వెచ్చదనం ప్రపంచంలో ఇంకెక్కడ ఉంటుంది అంటూ రొమాంటిక్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు.