దర్శకుడు నటుడు కళాతపశ్వి కే విశ్వనాథ్ గారు గురువారం రాత్రి 11 గంటల సమయంలో వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన సేవలను చేసినటువంటి దర్శకుడు మరణ వార్త తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అని చెప్పాలి.
ఇలా ఈయన మరణ వార్త తెలుసుకున్నటువంటి సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి తన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.
1965 లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ఆత్మగౌరవం అనే సినిమాతో ఈయన దర్శకుడిగా మారారు ఇలా దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినటువంటి ఈయన దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా గుర్తింపు పొందారు.ఇలా ఐదు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసిన విశ్వనాథ్ గారికి కూడా ఓ తీరని కోరిక కల ఉండిపోయిందట.ఈయన తన కోరికను నెరవేర్చుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ కోరిక మాత్రం నెరవేరలేదని తెలుస్తుంది.
విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఎక్కువగా సాంఘిక చిత్రాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.పౌరాణికం వైపు వెళ్లలేదు.ఈ జోనర్ పై పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల అటువైపు తొంగి చూడలేదు.కానీ, అన్నమయ్య సినిమా చేయాలని ఈయన ఎన్నో కలలు కన్నారట.చాలా సంవత్సరాల పాటు అన్నమయ్య కథపై పరిశోధనలు కూడా చేశారు.అయితే అన్నమయ్య పై మరొక దర్శకుడు సినిమా చేస్తున్నారని తెలియడంతో ఈయన తన ప్రయత్నాన్ని మానుకున్నారని దీంతో తన కోరిక తీరకుండానే మిగిలిపోయిందని చెప్పాలి.
ఇక అన్నమయ్య సినిమాని దర్శకుడుకే రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.